బింబిసార బాలయ్య చేసి ఉంటే.... ఇదేం విశ్లేషణ బాబోయ్!

By Sambi ReddyFirst Published Aug 8, 2022, 9:41 PM IST
Highlights

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సెన్సేషనల్ హిట్. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ మూవీ భారీ లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో అసలు బింబిసార చిత్రం బాలయ్య చేసి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ మొదలైంది.

దర్శకుడు వశిష్ట్ ఓ పవర్ ఫుల్ స్టోరీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఏ మాత్రం ఫార్మ్ లో లేని కళ్యాణ్ రామ్ కి మరపురాని హిట్ అందించారు. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా కూడా అదే జోరు చూపించింది. ఫస్ట్ డే నుండి కళ్యాణ్ రామ్ కెరీర్ లో రికార్డు వసూళ్లు ఈ మూవీ నమోదు చేసింది. ఏపీ/తెలంగాణాలలో బింబిసార రూ. 15 నుండి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మొత్తాన్ని మూడు రోజుల్లోనే బింబిసార చిత్రం వసూలు చేయడం విశేషం. 

భిన్నమైన లేయర్స్ ఉన్న పాత్రలో కళ్యాణ్ రామ్ విజృంభించాడు. అయితే ఈ కథ బాలయ్యకు పక్కా సెట్ అయ్యేదనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. బాలయ్య కానీ బింబిసార చేసి ఉంటే విజయం ఊహించడానికే కష్టం అయ్యేది అంటున్నారు. బింబిసార(Bimbisara) లాంటి మాస్ పవర్ ఫుల్ కథ బాలయ్యకు పడితే రికార్డులు బద్దలయ్యేవి అంటున్నారు. దర్శకుడు వశిష్ట్ మదిలో ఈ కథకు బాలయ్య కూడా ఉన్నారట. అయితే చిన్నపిల్లలను, ప్రజలను క్రూరంగా చంపడం వంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రకు బాలయ్య ఒప్పుకోడని దర్శకుడు సందేహించి ఉండవచ్చు. 

అయితే బాలయ్య చేస్తే హిట్ అవుతుందని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కళ్యాణ్ రామ్(Kalayan Ram) ఈ కథకు చక్కగా సెట్ అయ్యాడు కాబట్టే విజయం దక్కింది. ఇతర భాషల్లో హిట్టైన చిత్రాలు రీమేక్ చేసినంత మాత్రాన విజయం సాధించవు కదా. కాబట్టి బాలయ్య బింబిసార చేస్తే బాక్సాఫీస్ బద్దలయ్యేదన్న విశ్లేషణ సరికాదని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా వరుస పరాజయలతో ఇబ్బందిపడుతున్న ఇండస్ట్రీ కొంచెం ఊపిరి పోసుకుంది. ఈ వారం టాలీవుడ్ కి కలిసొచ్చింది. 

ముఖ్యంగా నందమూరి అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ(Balakrishna), కళ్యాణ్ రామ్ వరుసగా హిట్స్ నమోదు చేయడమే దీనికి కారణం. అఖండతో బాలకృష్ణ, ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ భారీ హిట్స్ కొట్టారు. తాజాగా బింబిసారతో కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ నమోదు చేయబోతున్నాడు. దీంతో నందమూరి అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది. 

click me!