మహర్షి యానిమేటెడ్‌ టీజర్‌

Published : Apr 11, 2019, 08:10 AM IST
మహర్షి యానిమేటెడ్‌ టీజర్‌

సారాంశం

  మహేశ్ బాబు  కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు  ‘మహర్షి’ మరో టీజర్ వైరల్ గా మారింది. అది మరేదో కాదు...మహర్షి సినిమా యానిమేటెడ్‌ టీజర్‌. సోషల్‌మీడియాలో  ఈ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది.

మహేశ్ బాబు  కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు  ‘మహర్షి’ మరో టీజర్ వైరల్ గా మారింది. అది మరేదో కాదు...మహర్షి సినిమా యానిమేటెడ్‌ టీజర్‌. సోషల్‌మీడియాలో  ఈ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో వైరల్‌గా మారింది. మహేష్ బాబుకు చెందిన కొందరు ఫ్యాన్స్ ఈ టీజర్‌ను రూపొందించారు. 

ఇక ఈ టీజర్ చూసిన దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విటర్‌లో స్పందించారు. యానిమేటెడ్‌ వెర్షన్‌ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ‘వీడియో అమేజింగ్‌గా ఉంది. మీరు (అభిమానులు) ప్రతి సినిమాను ప్రత్యేకం చేస్తుంటారు. మీకు రుణపడి ఉన్నాం. ఈ వీడియోను తయారు చేసిన మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అని వంశీ పేర్కొన్నారు. యానిమేషన్ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

మరో ప్రక్క   ఉగాది కానుకగా వచ్చిన  టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. టీజర్ లో మహేష్ చెప్పినట్టు ‘సక్సెస్‌లో ఫుల్‌స్టాఫ్‌లు ఉండవు.. కామాలు మాత్రమే ఉంటాయి’ అనే విధంగా దూసుకెళ్తోంది.  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజు వ్యవధిలో ఎక్కువమంది చూసిన టీజర్ కూడా ఇదే కావటం విశేషం. దాంతోపాటే, ట్విట్టర్ లో ఎక్కువమంది రీట్వీట్ చేసిన, లైక్ చేసిన టీజర్ గానూ మహర్షి మరో ఘనత అందుకుంది. 

‘మహర్షి’ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. మహేశ్‌ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?