అనుష్క శెట్టి మూవీపై రాంచరణ్, ప్రభాస్ కామెంట్స్.. స్పెషల్ ట్వీట్ తో సర్ప్రైజ్ ఇచ్చిన మెగా పవర్ స్టార్

Published : May 04, 2023, 02:43 PM ISTUpdated : May 04, 2023, 05:28 PM IST
అనుష్క శెట్టి మూవీపై రాంచరణ్, ప్రభాస్ కామెంట్స్.. స్పెషల్ ట్వీట్ తో సర్ప్రైజ్ ఇచ్చిన మెగా పవర్ స్టార్

సారాంశం

లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది.

లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. ప్రస్తుతం అనుష్క శెట్టి.. నవీన్ పోలిశెట్టి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో నటిస్తున్నారు. 

పి మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్స్ తో యువ హీరో నవీన్ పోలిశెట్టి జోరుమీదున్నాడు. అలాంటి హీరో సరసన అనుష్క శెట్టి జత కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలా ఉండబోతోంది.. అసలు ఈ చిత్రంలో అనుష్క గ్లామర్.. నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఉంది. 

ఇటీవల టీజర్ విడుదల చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. నవీన్, అనుష్క మధ్య కెమిస్ట్రీ చాలా కొత్తగా అనిపిస్తోంది. తాజాగా ఈ టీజర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ గురించి ట్వీట్ చేస్తూ చిత్ర యూనిట్ ని సర్ప్రైజ్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. రెప్రెషింగ్ గా అనిపిస్తోంది. చిత్ర యూనిట్ కి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. 

యువి క్రియేషన్స్ బ్యానర్ లో రాంచరణ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించాల్సింది. కానీ ఊహించని విధంగా ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ప్రస్తుతం గౌతమ్.. విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్నారు. 

అదేవిధంగా ప్రభాస్ నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి.  డార్లింగ్ నుంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందని, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు ప్రభాస్. ఇలా ఇద్దరు పెద్ద స్టార్స్ టీజర్ ను హైప్ చేయడంతో మూవీ టీమ్ కు పెద్ద బూస్టప్ గా నిలిచిందని చెప్పొచ్చు.  ఇక ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్‌ బాబు.పి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?
Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?