స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (Rip Raju) పూర్తి పేరు తోటకూరి వెంకట సోమరాజు. 1954 జూలై లో 27న జన్మించారు. వీరిది రాజమండ్రి దగ్గర రఘుదేవపురం. ఒకప్పటి సుప్రసిద్ధ సంగీత దర్శకులు తోటకూర వెంకట రాజు (T.V Raj) తనయుడే ఈయన.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (Rip Raju) పూర్తి పేరు తోటకూరి వెంకట సోమరాజు. 1954 జూలై లో 27న జన్మించారు. వీరిది రాజమండ్రి దగ్గర రఘుదేవపురం. ఒకప్పటి సుప్రసిద్ధ సంగీత దర్శకులు తోటకూర వెంకట రాజు (T.V Raj) తనయుడే ఈయన. టీవీ రాజు గారు స్వర్గీయ, సీనియర్ ఎన్టీఆర్ కు బాగా సన్నిహితులు. అన్నగారు స్థాపించిన NAT (నేషనల్ ఆర్ట్ థియేటర్) ప్రొడక్షన్ హౌజ్ లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు ఆయనే సంగీత దర్శకులుగా పనిచేశారు.
తండ్రి సంగీత బాటలోనే రాజ్ కూడా పయనించారు. సంగీతంలో ఓనమాలు నేర్చుకునే క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తో బాండ్ ఏర్పండింది. అప్పటి నుంచి ద్వయం సంగీత దర్శకులుగా పనిచేశారు. వీరి కాంబోలో 180కు పైగా సినిమాలు వచ్చాయి. 1995లో వీరు విడిపోయి సెపరేట్ గా కేరీర్ ను కొనసాగించారు.
రాజ్ కుటుంబ సభ్యుల విషయానికొస్తే.. తండ్రి టీవీ రాజు సుప్రసిద్దం సంగీత దర్శకులుగా తెలిసిన వారే. ఆయన పేరు తల్లి సావిత్రి. ఈయనకు అన్నయ్య తోటకూర సత్య సూర్యనారాయణ కూడా ఉన్నారు. రాజ్ కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై అమితమైన ప్రేమ, ఆసక్తి ఉండేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇక 1982 మార్చి 11న రాజ్ వివాహం జరిగింది. ఈయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు దీప్తి, రెండో కూతురు దివ్య మూడో కూతురు శ్వేత ఉన్నారు. రెండో అమ్మాయి దివ్య చిత్ర పరిశ్రమలోనే అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
మూడో అమ్మాయి శ్వేత మలేషియాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫోరమ్ మాల్ సమీపంలోనే నివాసం ఉంటున్నారు. రాజ్ మరణంతో కోటీ, చిరంజీవి నివాళి అర్పించారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.