పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో ‘OG’ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. తాజాగా యూనిట్ క్రేజీ అప్డేట్ అందించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆ చిత్రాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.... హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ సినిమాలకే ఫుల్ టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ - సుజీత్ (Sujeeth) కాంబోలో రాబోతున్న చిత్రంపై అప్డేట్ అందింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ యాక్షన్ ఫిల్మ్ ను సుజీత్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ తరహాలో యాక్షన్ సీన్స్ ను, అందుకు తగ్గ కథను ఎంచుకొని తెలుగు ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG అనే చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. పవన్ అన్నీ ప్రాజెక్టుల్లో కన్నా ఈ సినిమాపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్టేడ్ అందించారు.
త్వరలో షూటింగ్ ప్రారంభించబోతుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సుజీత్ లోకేషన్ల వేటలో చాలా బిజీగా ఉన్నారని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఫొటోలను బట్టి సుజీత్ ముంబైలోని పలు ఫేమస్ స్పాట్ లను షూటింగ్ కు ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రధానంగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, చారిత్రక కట్టడమైన ఫ్లోరా ఫౌంటేన్ వంటి లోకేషన్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తరుణంలో ముంబైని షూటింగ్ స్పాట్ గా ఎంచుకున్నారని తెలుస్తోంది. డీవోపీ రవి కే చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ తో కలిసి లోకేషన్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో వచ్చిన పోస్టర్ కూడా భారీ హైప్ ను క్రియేట్ చేసింది.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో ‘ఓజీ’ కోసం సుజీత్ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. బలమైన కథతో వస్తున్నాడని ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. వచ్చే నెల నుంచే రెగ్యూలర్ షూటింగ్ కూడా జరనుంది. చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైతే వచ్చే దసరాకు లేదంటే నెక్ట్స్ ఇయర్ విడుదల కానుంది.
Our director , along with and production designer , are on a location scout for ! 🔥❤️ pic.twitter.com/l2ZbfJ0rjb
— DVV Entertainment (@DVVMovies)