
లక్ష్యం, లౌక్యం, రామరామ కృష్ణ కృష్ణ లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా శ్రీవాస్ కొనసాగుతున్నారు. చివరగా హీరో గోపీచంద్ తో రామబాణం అనే చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కించారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చవిచూసింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ఏమాత్రం మెప్పించలేకపోయింది. లక్ష్యం, లౌక్యం తర్వాత గోపీచంద్ తో హ్యాట్రిక్ హిట్స్ కొడదామనుకున్న శ్రీవాస్ కోరిక నెరవేరలేదు.
అయితే ప్రస్తుతం శ్రీవాస్ బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నిస్తున్నారు. కొంత గ్యాప్ తీసుకుని మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. తాజాగా శ్రీవాస్ తదుపరి చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. శ్రీవాస్ తదుపరి ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్.
వెంకీ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. శ్రీవాస్, వెంకీ కాంబినేషన్ లో చిత్రం గురించి కొన్నేళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో కుదర్లేదు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీవాస్, వెంకీ కాంబోలో మూవీ పక్కా అని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. శ్రీవాస్ వెంకటేష్ కోసం ఏ జోనర్ కథ సిద్ధం చేస్తున్నారో తెలియదు కానీ.. ఒక సర్ప్రైజింగ్ స్టోరీతోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
అలాగే శ్రీవాస్.. కింగ్ నాగార్జునతో కూడా ఒక చిత్రానికి కమిటైనట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా శ్రీవాస్ సీనియర్ హీరో బాట పడుతున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ చిత్రాలని ఎంటర్టైనింగ్ గా చెప్పడం శ్రీవాస్ శైలి.