Naresh : కోర్టు తీర్పు తర్వాత.. రమ్య రఘుపతిపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Published : Aug 04, 2023, 02:18 PM ISTUpdated : Aug 04, 2023, 02:26 PM IST
Naresh : కోర్టు తీర్పు తర్వాత.. రమ్య రఘుపతిపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సారాంశం

కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత.. సీనియర్ నటుడు నరేష్ తన మూడో భార్య రమ్యరఘుపతిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యాయం స్థానం వెలువరిచిన తీర్పు తర్వాత ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.  

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ (Naresh)  తన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi)  మధ్య వివాదం గతేడాది నుంచి కొనసాగుతూనే వచ్చింది. ఏడాది తర్వాత కోర్టు రీసెంట్ గా తీర్పు వెల్లడించింది. నరేష్ - పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమ్య రఘుపతి  కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే నరేష్ ఇంట్లోకి అనుమతిపైనా న్యాయం చేయాలని కోరింది. దీనిపై కోర్టు తీర్పు వెల్లడించింది. 

సెన్సార్స్ బోర్డు అనుమతి ఇచ్చిన సినిమాను అడ్డుకునే అధికారం లేదని సినిమాకు లైన్ క్లియర్ చేసింది. అలాగే నరేష్ ఇంట్లోకి కూడా రమ్య రఘుపతి ఎంట్రీని నిషేధిస్తూ తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలో నరేష్ ప్రముఖ మీడియాతో మాట్లాడారు. తన మూడో భార్య రమ్య రఘుపతిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా మాట్లాడుతూ.. రమ్యకు చాలా అప్పులు ఉన్నాయని తెలిపారు. అప్పులు ఇచ్చిన వారు తమ ఇంటికి కూడా వస్తున్నారన్నారు. ఇది మా కుటుంబీకులకు ఇబ్బందిగా ఉందని చెప్పుకొచ్చారు. 

అందుకే తమకు కోర్టు నుంచి రక్షణ కావాలని కోరినట్టు తెలిపారు. రమ్యకు తమ ఇంట్లోకి ప్రవేశం లేదని బెంగళూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కూడా గుర్తు చేశారు. అలాగే ఆర్డర్ కాపీలో తను, రమ్య ఇద్దరూ విడిగానే ఉన్నారనే విషయాన్ని కూడా పేర్కొన్నట్టు చెప్పారు. అది కూడా ఆరేళ్లు గా వారిద్దరూ కలిసి ఉండటం లేదని నిర్ధారించిందని చెప్పుకొచ్చారు. న్యాయస్థానం తీర్పుతో డివోర్స్ కు మార్గం సులువైందని అభిప్రాయపడ్డారు. 

డివోర్స్ కు సంబంధించి ఆయన ఇప్పటికే కూకట్ పల్లి కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారనని తెలిపారు. ఇందుకు న్యాయం స్థానం తీర్పు సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. 2023 ప్రారంభంలోనే నరేష్ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. ఇక నరేష్ - పవిత్రా లోకేష్ రిలేషన్ పైనా స్పందించారు. తమ గురించి చాలా మంది పలురకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారని అన్నారు. తమ పర్సనల్ లైఫ్ పై అందరూ కామెంట్లు చేయడం బాధాకరంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఇకనైనా ప్రశాంత మైన జీవితం గడపాలనుకుంటున్నట్టు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..