శంకర్ `ప్లాన్‌ బి` అమలు చేస్తున్నాడా?.. `ఇండియన్‌ 2` ఔట్‌?

Published : Nov 02, 2020, 08:11 AM IST
శంకర్ `ప్లాన్‌ బి` అమలు చేస్తున్నాడా?.. `ఇండియన్‌ 2` ఔట్‌?

సారాంశం

`భారతీయుడు 2` సినిమా ఉంటుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్‌ తప్పుకున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సస్పెన్స్ లో ఉన్న నేపథ్యంలో శంకర్ ప్లాన్‌ బి అమలు చేస్తున్నారట. 

దర్శకుడు శంకర్‌.. భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌. ఆయన ఓ సినిమా తీస్తున్నాడంటే దాని బడ్జెట్‌ వందల కోట్లల్లో ఉంటుంది. అందుకు తగ్గ స్టార్‌ కాస్ట్ ని ఎంపిక చేసుకుంటారు శంకర్‌. ప్రస్తుతం ఆయన కమల్‌ హాసన్‌తో `భారతీయుడు2` సినిమాని తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 

దీంతో సినిమా ఉంటుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్‌ తప్పుకున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సస్పెన్స్ లో ఉన్న నేపథ్యంలో శంకర్ ప్లాన్‌ బి అమలు చేస్తున్నారట. మరో భారీ మల్టీస్టారర్‌ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. 

తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ భారీ కాస్టింగ్‌తో పాన్‌ ఇండియా సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. ఇప్పటికే తమిళం నుంచి విజయ్‌ సేతుపతి, కన్నడ నుంచి యష్‌ని ఎంపిక చేశారని, తెలుగు, మలయాళం, హిందీ భాషల నుంచి స్టార్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. రాక్‌లైన్‌ వెంకటేష్‌ ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది మున్ముందు తేలనుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు