`వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

Published : Nov 02, 2020, 07:36 AM IST
`వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

సారాంశం

కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్‌ అయి సంచలనం సృష్టించారు పవన్‌ కళ్యాణ్‌. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అందులో భాగంగా మొదటగా `వకీల్‌ సాబ్‌`ని పూర్తి చేయనున్నారు. ఇది బాలీవుడ్‌ చిత్రం `పింక్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. 

కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వరుసగా పది రోజులు పవన్‌ ఈ షూటింగ్‌లో పాల్గొంటారట. ఆ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్ళీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని తెలుస్తుంది. డిసెంబర్‌ వరకు సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. షూటింగ్‌కి సంబంధించి తాజాగా ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇక వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌ సరసన శృతి హాసన్‌ కనిపించనున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత పవన్‌ రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు