
హీరోలు రెండేసి సినిమాలు చేయడం కామన్ కాని.. డైరెక్టర్ రెండేసిసినిమాలు డైరెక్ట్ చేయడం చాలా కష్టమని చెప్పాలి.కాని ఆపనిని బ్యాలన్స్డ్ గా చేసేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం శంకర్ RC15తో పాటు ఇండియన్-2 సినిమాలను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ తో ఆర్సీ15 ను పరుగులు పట్టిస్తూనే.. భారతీయుడు2 సినిమాను కూడా నడిపిస్తుసన్నాడు శంకర్. రీసెంట్ గా చరణ్ తో వైజాగ్ షూటింగ్ లో కనిపించిన శంకర్.. అంతలోనే భారతీయుడు సెట్ లో ప్రత్యక్షం అయ్యాడు.
శంకర్ లాంటి ఒక విజనరీ డైరెక్టర్ రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేయడం అంటే విశేషం అనే చెప్పాలి. ఇక ఇటీవలే ఆర్‌సీ15లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న శంకర్.. ఇప్పుడు ఇండియన్-2 సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని శంకర్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. మెగా అభిమానులకు ట్విట్టర్ లో ట్విష్ట్ ఇచ్చాడు శంకర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అసలు ముందుగా భారతీయుడు2 సినిమానే స్టార్ట్ చేశడు శంకర్. కాకపోతే పలు వివాదాల కారణంగా ఆసినిమా ఆగిపోవడంతో.. రామ్ చరణ్ 15 వసినిమాను స్టార్ట్ చేశాడు శంకర్. ఈ మూవీ సగంలో ఉండగానే మళ్ళీ భారతీయుడు2 కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే ఆసినిమాకు బ్రేక్ ఇవ్వడం సాధ్యం కాదు.. భారీ ప్రాజెక్ట్ అవ్వడంతో.. రామ్ చరణ్ సినిమాను అజస్ట్ చేస్తూ.. భారతీయుడు2 సినిమాను చిన్నగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనిచూస్తున్నాడు. అందుకే రీసెంట్ గా మూడు షెడ్యూల్స్ ను వరుసగా కంప్లీట్ చేసి.. చెన్నై చేరాడు శంకర్.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ రెడ్ జియాంట్ బ్యానర్‌తో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.