
80,90 దశకంలో వెండితెరను ఏలిన హీరోయిన్లలో గౌతమీ కూడా ఉన్నారు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో ఆడిపాడిన బ్యూటీ సూపర్ సక్సెస్ తో దూసుకుపోయింది. అప్పట్లో చబ్బి చబ్బిగా.. క్యూట్స్ లుక్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది చిన్నది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది గౌతమి. అప్పుడుప్పుడు వెండితెరపై మెరుస్తుంటుంది.
1980, 90 లో హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. 80వ దశకం చివరలో తెలుగు సినిమాకి పరిచయమైన గౌతమి 90 స్ లో ఉన్న హీరోయిన్లకు పోటీగాసినిమాలు చేసింది. హీరోయిన్ గా ఫస్ట్ క్లాస్ మార్కులు వేయించుకుంది గౌతమి. వెంకటేశ్ .. నాగార్జున వంటి స్టార్స్ జోడీగా తెరపై సందడి చేశారు.
అయితే చిన్నా పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చిన గౌతమి.. తెలుగులో స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణతో మాత్రం సినిమాలు చేయలేదు. అయితే వారితో సినిమాలు చేయకపోవడానికి అసలుకారణం వెల్లడించింది గౌతమి. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది సీనియర్ బ్యూటీ.
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ .. చిరంజీవిగారు .. బాలకృష్ణగారి సినిమాల నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే నా డేట్స్ కుదరకపోవడం వలన, ఆ ఇద్దరితో చేయలేకపోయాను. ఈఇద్దరు హీరోల సినిమాల నుంచి ఛాన్స్ వచ్చినప్పుడే నేను వేరే సినిమాల్లో బిజీగా ఉండేదాన్ని.. అనుకోకుండా అలా జరిగిపోుయిందంటూ చెప్పుకోచ్చారు గౌతమి.
అంతే కాదు తన సినిమా కెరీర్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు గౌతమి. సినిమాల విషయంతో తన తల్లీ తండ్రులు ఎప్పుడూ ప్రొత్సహించారంటోంది గౌతమి. అయితే తన కూతురు మాతరం తాను చెప్పకుండానే ఫిల్మ్ మేకింగ్ వైపు అడుగులువేసిందన్నారు. ప్రస్తుతం చెన్నైలో వంటరిగా ఉంటుందో గౌతమి. గతంలో లోకనాయకుడు కమల్ హాసన్ తో సహజీవనం చేసింది గౌతమి. కొన్నాళ్లకు కమల్ తో బ్రేకప్ చెప్పింది.
80వ దశకానికి చెందిన హీరోయిన్స్ టీమ్ ప్రతిఏడాది కలుస్తుంటారు. అందులో మీరు ఎందుకులేరు అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పింది గౌతమి. ఆమె మాట్లాడుతూ.. ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానిస్తూనే ఉంటారు. అయితే నిజానికి వాళ్లంతా నా కంటే కూడా సీనియర్స్. అందువలన వాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటివారితో నేను చనువుగా మసలుకోలేను. అందువల్లనే నేను వెళ్లడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.