
టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు నటుడు నందు. స్టార్ సింగర్ గీతా మాధురి భర్త అయిన నందు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రాణిస్తున్నాడు. హీరోగా మెప్పించేందుకు సర్వైవ్ అవుతున్నాడు. తాజాగా ఆయన కాలుకి గాయంతో కనిపించారు. కుడికాలుకి కట్టుతో నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే తన డబ్బింగ్ థియేటర్‌లో ఫోన్ చూస్తూ కనిపించారు.
అయితే ఆయన కాలుకి గాయమైనా దాన్ని లెక్క చేయకుండా డబ్బింగ్ చెప్పేందుకు వచ్చారు నందు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలను చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతుంది. అదే విషయాన్ని ఆయన తన పోస్ట్ లోనూ పేర్కొన్నారు. తాను డబ్బింగ్ చెబుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌అవుతుంది. ఆయన ఫ్రెండ్స్, అభిమానులు,నెటిజన్లు త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. అయితే నందుకి గాయం ఎలా అయ్యిందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక నందు `ఫోటో`(2006) చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. సిద్దు పాత్రలో మెప్పించారు. అందులో ఆనంద్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఓ భోజ్‌పూరి సినిమా చేశాడు. `100%లవ్` చిత్రంలోనూ కాస్త నెగటివ్ రోల్‌లో మెప్పించారు. `ఆటోనగర్ సూర్య`లో నందుగా స్క్రీన్ నేమ్‌ని మార్చుకున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. `పాఠశాల`, `రభస`,`ఐస్ క్రీమ్ 2`,`పెసరట్టు`, `365డేస్` , `సూపర్‌స్టార్ కిడ్నాప్`, `శౌర్య`, `పెళ్లి చూపులు`, `జై లవకుశ`, `రాజుగారి గది2`, `సమ్మోహనం` చిత్రాల్లో నటించారు.
`సవారి` చిత్రంతో హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్‌గా మెప్పించలేకపోయినా నందుకి మంచిపేరొచ్చింది. దీంతోపాటు గతేడాది యాంకర్ రష్మితో కలిసి `బొమ్మ బ్లాక్‌బస్టర్` చిత్రంలో నటించారు. ఇది కూడా ఫర్వాలేదనిపించుకుంది. ఇలా చిన్న చిన్నగా పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నటుడిగా మంచి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు.