అది నా సొంత కథ.. ఎనిమిదేళ్ల తరువాత స్పందించిన స్టార్ డైరెక్టర్!

Published : Aug 07, 2018, 11:21 AM IST
అది నా సొంత కథ.. ఎనిమిదేళ్ల తరువాత స్పందించిన స్టార్ డైరెక్టర్!

సారాంశం

ఈ కథ తనదేనంటూ ఆరూర్ తమిళనాథన్ అనే రైటర్ కోర్టులో కేసు వేశారు. దీంతో శంకర్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి కలిగింది. ఈ విషయమై శంకర్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. అందులో ఈ సినిమా కథ తనదేనన.. ఆరూర్ తమిళనాథన్ చెప్పిన కథకి దీనికి అసలు సంబంధమే లేదని శంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 'యందిరన్‌' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. 2010 లో వచ్చిన ఈ సినిమా తెలుగులో 'రోబో' పేరుతో విడుదలయ్యి రికార్డులు కొల్లగొట్టింది. రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ఈ సినిమా దర్శకుడిగా శంకర్ కి మంచి పేరు తీసుకొచ్చింది.

ఆయన సినిమాలో చూపించిన టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ కథ తనదేనంటూ ఆరూర్ తమిళనాథన్ అనే రైటర్ కోర్టులో కేసు వేశారు. దీంతో శంకర్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి కలిగింది. ఈ విషయమై శంకర్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. అందులో ఈ సినిమా కథ తనదేనన.. ఆరూర్ తమిళనాథన్ చెప్పిన కథకి దీనికి అసలు సంబంధమే లేదని శంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా 'రోబో 2.0' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ అది కాస్త నవంబర్ కి వాయిదా పడింది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్