ప్రభాస్‌ ఫ్యాన్స్ కి అసలైన పండగ.. బర్త్ డేకి త్రిబుల్‌ ట్రీట్‌.. ప్రాజెక్ట్ కే నుంచి క్రేజీ అప్‌డేట్..

Published : Oct 22, 2022, 01:26 PM IST
ప్రభాస్‌ ఫ్యాన్స్ కి అసలైన పండగ.. బర్త్ డేకి త్రిబుల్‌ ట్రీట్‌.. ప్రాజెక్ట్ కే నుంచి క్రేజీ అప్‌డేట్..

సారాంశం

`బిల్లా`ని మరోసారి థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయబోతున్నారు అభిమానులు. దీనికితోడు మరో మూడు సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్లు ఇవ్వబోతున్నారు.

డార్లింగ్‌ ఫ్యాన్స్ పండగ చేసుకునే టైమ్‌ వచ్చింది. రేపు(అక్టోబర్‌ 23) ప్రభాస్‌ బర్త్ డే అనే విషయం తెలిసిందే. దీంతో అభిమానులు చాలా రోజుల నుంచే సంబరాలకు సిద్ధమయ్యారు. గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. అదే సమయంలో అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పాన్‌ ఇండియా స్టార్‌. ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల నుంచి అప్‌డేట్లు ఇవ్వబోతున్నారు. 

ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన `బిల్లా` సినిమాని 4కే రెజల్యూషన్‌తో రేపు విడుదల కాబోతుంది. పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్‌ నటించిన చిత్రం కావడంతో దీన్ని భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. అమెరికాలోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లు కృష్ణంరాజు భాగమైన `ఇండియా డయాబెటిక్‌ ఫుట్ ఫౌండేషన్‌`కి విరాళంగా ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ స్టార్‌ కూతురు, నిర్మాత ప్రసీద ప్రకటించింది. `బిల్లా`ని మరోసారి థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయబోతున్నారు అభిమానులు. 

దీనికితోడు మరో మూడు సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్లు ఇవ్వబోతున్నారు. `ఆదిపురుష్‌` సినిమాకి సంబంధించిన మరో టీజర్‌ని విడుదల చేయబోతున్నారట. మొదటి టీజర్‌ విమర్శలెదుర్కొన్న నేపథ్యంలో ఈసారి ఆ విమర్శలకు చెక్ పెడుతూ బెస్ట్ వీడియోని ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ఇంకోవైపు `సలార్‌` నుంచి గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందట. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ .. డార్లింగ్‌ అభిమానులకోసం ఓ సర్‌ప్రైజ్‌ని ప్లాన్‌ చేసినట్టు టాక్‌. 

అలాగే `ప్రాజెక్ట్ కే` నుంచి కూడా ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్టు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వెల్లడించారు. ఓ అభిమాని దర్శకుడిని ప్రశ్నించగా, రేపు చిన్న సర్‌ప్రైజ్‌ రాబోతుందని తెలిపారు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు దర్శకుడు. మరి ఆ సర్‌ప్రైజ్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిది ట్రెండింగ్‌ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ