#SandeepReddyVanga:'అర్జున్ రెడ్డి' టు 'యానిమల్' ..మెంటల్ ఎక్కిస్తున్న లెక్కలు

By Surya Prakash  |  First Published Feb 5, 2024, 6:29 AM IST

‘యానిమల్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్.. ప్రస్తుతం ప్రభాస్‌తో తీయబోయే ‘స్పిరిట్’ మీద ఫోకస్ పెట్టాడు. 



ఓ తెలుగు దర్శకుడు హిందీకి వెళ్లి బ్లాక్ బస్టర్స్ ఇవ్వటం రామ్ గోపాల్ వర్మ తో మొదలైంది. దాన్ని సందీప్ రెడ్డి వంగా కంటిన్యూ చేస్తున్నారు. యానిమల్ బ్లాక్ బస్టర్ తో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో చర్చగా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కు భాక్సాఫీస్ మీద ఉన్న పట్టు చూస్తే మతిపోతుంది. ఆయన సినిమాలు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఏ విధంగా పెరుగుతూ పోయాయో చూస్తుంటే ప్రభాస్ సినిమాపై హైప్ ఓ రేంజిలో పెరిగిపోతోంది.అవి మనమూ చూద్దాం.

 #ArjunReddy: ₹50 Crores

Latest Videos

#KabirSingh: ₹375 Crores (+750%)

 #Animal: ₹920 Crores (+245%)

ఈ లెక్కలు చూసిన ఏ నిర్మాతకైనా, హీరోకు అయినా వెంటనే సందీప్ రెడ్డి వంగా తో సినిమా వెంటనే చేయాలనుకుంటారు. ప్రస్తుతం సందీప్ వంగా రెండు ప్రాజెక్టులు ఓకే చేసి పెట్టుకున్నాడు. ఒక యానిమల్ పార్క్ స్క్రిప్ట్ పూర్తి చేయడం. అది  ప్రణయ్ వంగా టీమ్ దే  బాధ్యత . ఆ టీమ్ సందీప్  సూచనలతో  స్టోరీకి ఒక రూపం తెచ్చి, స్క్రిప్టు పూర్తి చేసే  పనిలో ఉన్నారట. మరో ప్రక్క  ప్రభాస్ స్పిరిట్ ఉంది. ప్రభాస్ డేట్స్ ఫలానా అప్పటి నుంచి అని కన్ఫర్మ్ కాక ముందే ఫైనల్ వెర్షన్ రెడీ చేయాలి. ఈ రెండూ పూర్తి చేసేనాటికి 2026 దాటిపోవచ్చు.  ఈ ప్రాజెక్టుల తర్వాత  అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ టి సిరీస్ నిర్మాణంలో ఆల్రెడీ లాక్ అయ్యింది.  ఈ సినిమాలతో ఏ స్దాయి కలెక్షన్స్ తెస్తాడో మరి సందీప్ చూడాలి. 
 

click me!