ప్రభాస్-సందీప్ వంగ స్పిరిట్ మూవీ హీరోయిన్ గా రష్మిక మందాన?

By Sambi Reddy  |  First Published Feb 4, 2024, 7:27 PM IST

యానిమల్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ. ఆయన నెక్స్ట్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మందాన అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 
 


సెన్సేషనల్ దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి మూవీతో దర్శకుడిగా మారిన ఆయన సిల్వర్ స్క్రీన్ మీద సంచలనాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీతో హీరో విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. ఇక యానిమల్ చిత్ర సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. చిత్ర కంటెంట్ పై తీవ్ర విమర్శలు వినిపించాయి. అయినా మూవీ భారీ హిట్ కొట్టింది. యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆయన నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. ఈ ఏడాది స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. 

Latest Videos

ఈ చిత్ర హీరోయిన్ గా రష్మిక మందాననను తీసుకున్నరని ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. యానిమల్ మూవీలో రష్మిక పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో కూడా ఆమెనే తీసుకున్నారట. అందులోనూ ప్రభాస్ తో రష్మిక మందాన నటించింది లేదు. ఈ క్రమంలో ఆమెను ఎంపిక చేశారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2829 AD మూవీ చేస్తున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కల్కి మే 9న విడుదల కానుంది. రాజా సాబ్ సైతం ఈ ఏడాది థియేటర్స్ లోకి రానుంది. 
 

click me!