Tollywood Updates : ‘ట్రూ లవర్’ ట్రైలర్.. సుడిగాలి సుధీర్ GOAT, ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ నుంచి సాంగ్స్!

By Nuthi SrikanthFirst Published Feb 4, 2024, 11:17 PM IST
Highlights

టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ఇంట్రెస్టింగ్ చిత్రాల నుంచి అప్డేట్స్ అందాయి. సుడిగాలి సుధీర్, అభినవ్ గోమఠం లేటెస్ట్ సినిమాల సాంగ్స్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. 

గోట్ మూవీ..

సుడిగాలి సుధీర్ Sudigali Sudheer తాజా చిత్రం G.O.A.T  (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక.  దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌.  ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఈచిత్రం నుంచి ‘అయ్యో పాపం సారూ..’ అనే ఓ బ్యూటిఫుల్ లిరిక‌ల్ వీడియోను శ‌నివారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. సురేష్ బ‌నిశెట్టి సాహిత్యం స‌మ‌కూర్చిన  ఈ  పాట‌కు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. హీరో సుధీర్‌, హీరోయిన్ దివ్య‌భార‌తిల‌పై  చిత్రీక‌రించిన ఈ పాట విన‌సొంపైన బాణీల‌తో, క్యాచీ ప‌దాల‌తో అంద‌ర్ని ఆక‌ట్టుకునే విధంగా వుంది. 

Latest Videos

మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా..

కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ (Masth Shades Unnai Ra). ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ‘హలో అమ్మాయి’ అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటకు కిట్టు   విస్సా ప్రగడ లిరిక్స్ రాశారు.. టి సంజీవ్ అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు, సిద్ శ్రీరామ్ గానంతో ఈ పాటకే అందం వచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రం మొత్తం హీరో తన ప్రేయసి చుట్టు తిరుగుతూ తన ప్రేమ తాలూకా భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు, హీరోయిన్ పాత్రలో వైశాలి రాజ్ నటించారు, ఈ సాంగ్లో అభినవ గోమటం వైశాలి రాజ్ ఇద్దరు ఫీల్ గుడ్ రొమాన్స్ ని పండించారు. 

కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ చిత్రాన్ని తిరుపతిరావు డైరెక్షన్ చేయగా భవాని కాసుల, అరీం రెడ్డి అండ్ ప్రశాంతి వి ప్రొడ్యూస్ చేశారు.. పులిమేర 2 చిత్రం ద్వారా వంశీ నందిపాటికి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు వచ్చింది, ఈ వంశీ నందిపాటి ఈ మస్తు షేడ్స్ ఉన్నాయి రా చిత్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 23న రిలీజ్ చేయబోతున్నారు.

ట్రూ లవర్...

తమిళంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ట్రూ లవర్’ True Lover. ప్రస్తుతం తెలుగు వెర్షన్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.  మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. 

ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఇవాళ  ‘ట్రూ లవర్’ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైటర్ రాకేందు మౌళి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, హీరో మణికందన్, డైరెక్టర్ మారుతి సినిమా గురించిన విషయాలను పంచుకున్నారు. 

click me!