కొండా మూవీని ఎవరూ ఆపలేరు.. తెలంగాణా మంత్రికి వర్మ మాస్ వార్నింగ్!

Published : Oct 20, 2021, 04:10 PM IST
కొండా మూవీని ఎవరూ ఆపలేరు.. తెలంగాణా మంత్రికి వర్మ మాస్ వార్నింగ్!

సారాంశం

 Konda మూవీ షూటింగ్ లో వర్మ నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని సమాచారం.

తెలంగాణ రక్త చరిత్ర పేరుతో కొండా చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వరంగల్ కి చెందిన ప్రముఖ పొలిటికల్ దంపతులు కొండా సురేఖ, కొండా మురళి బయోపిక్ గా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వర్మ ప్రకటించారు. ఇటీవల షూటింగ్ లాంచ్ కార్యక్రమం కొండా సురేఖ ఇలాఖాలో నిర్వహించారు. వర్మకు Konda Surekha ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆరోజు కొండా సురేఖ వర్గీయులు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 


 Konda మూవీ షూటింగ్ లో వర్మ నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని సమాచారం. కొండా చిత్రంలో తమను విలన్స్ గా చూపిస్తాడని కొండా సురేఖ ప్రత్యర్ధులు, వాళ్ళతో వైరుధ్యం ఉన్నవారు భావిస్తున్నారు. వరంగల్ కి చెందిన ఓ పొలిటీషియన్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 

Also read `రింగ్ మాస్టర్‌ నువ్వే`.. వర్మకి మంచు మనోజ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌..
సదరు వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ అందుకుంటున్న Ram gopal varma వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్వీట్ అండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ''అరచేతిని అడ్డుపెట్టి  సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ'' అంటూ ట్వీట్ చేశాడు. 

Also read 'మా' సభ్యులందరూ సర్కర్ లో జోకర్స్... మళ్ళీ రెచ్చిపోయిన వర్మ!
ఇక వర్మకు ఇలాంటి బెదిరింపులు, దాడులు కొత్తేమి కాదు. గతంలో ఆయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, వంగవీటి, పవర్ స్టార్ లాంటి చిత్రాలు అనేక వివాదాలకు కారణం అయ్యాయి. అదే తరహాలో కొండా మూవీ చుట్టూ కూడా వివాదాలు ఏర్పడే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. మరి వర్మకు వివాదాలే పెట్టుబడి కాబట్టి, ఎంత వివాదం రగిలితే, అంతగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌