ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ‘మిషన్ తషాఫీ’ స్పై థ్రిల్లర్ సిరీస్.. షూటింగ్ ప్రారంభం.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

By Asianet News  |  First Published Jun 18, 2023, 9:33 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen sattaru)  క్రేజీ సిరీస్ తో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ఇందుకు సంబంధించిన తాజాగా ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను వెల్లడించారు. 
 


తెలుగు చిత్ర పరిశ్రమలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru). లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడ వేగ, 11th అవర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తనదైన డైరెక్షన్ తో ప్రేక్షకులను అలరించారు. చివరిగా కింగ్, అక్కినేని నాగార్జున హీరోగా ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ తో వస్తారని ఆసక్తికరంగా ఎదరుచూస్తుండగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. 

ప్రస్తుతం  వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే.. సినిమాలకు ధీటుగా ఓటీటీలో దుమ్ములేపుతున్నారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు సిరీస్ లపై ఫోకస్ పెడుతున్న విషయంతెలిసిందే. ఇక తాజాగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ను తాజాగా వెల్లడించారు. 

Latest Videos

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రాబోతున్న సిరీస్ కు ‘మిషన్ తషాఫి’ (Mission Tashafi) అనేటైటిల్ ను కూడా ఖరారు చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5  నిర్మిస్తోంది. ఈ సిరీస్ తో స‌రికొత్త సంచ‌ల‌నం చేయబోతోంది. ఓటీటీ చ‌రిత్రలో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో రూపొందించబోతోంది. శనివారం ఈ హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘మిషన్ తషాఫి’ షూటింగ్ కూడా ప్రారంభం కావడం విశేషం. ఇప్పటికే వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్‌తో ఆక‌ట్టుకోవ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.

ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుండటం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించ‌బోయే న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. 

8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను  ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ‌ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించని స‌రికొత్త లొకేష‌న్స్‌లో ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు. సినిమాటోగ్ర‌ఫీ: న‌రేష్ రామ‌దురై, ఆర్ట్:  సాయి సురేష్‌, ఎడిట‌ర్‌ గా ధ‌ర్మేంద్ర కాక‌రాల‌ వ్యవహరిస్తున్నారు. 

click me!