కాజల్ కొత్త మూవీ టైటిల్ టీజర్.. ఇంత వయలెంట్ గా ఉంది ఏంటి బాబోయ్, ఎప్పుడూ చూడని చందమామ

Published : Jun 18, 2023, 08:54 PM IST
కాజల్ కొత్త మూవీ టైటిల్ టీజర్.. ఇంత వయలెంట్ గా ఉంది ఏంటి బాబోయ్, ఎప్పుడూ చూడని చందమామ

సారాంశం

వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్.. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.  కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు.

వివాహం తర్వాత కాజల్ కమర్షియల్ చిత్రాలు చేస్తూనే వైవిధ్యమైన చిత్రాలకు కూడా సైన్ చేస్తోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్.. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సత్యభామ అనే టైటిల్ ఖరారు చేశారు. 

సత్యభామ అనే టైటిల్ లోనే కాస్త పొగరు వగరు ఉంటుంది.కానీ ఈ టీజర్ లో కాజల్ అంతకి మించి కనీవినీ ఎరుగని విధంగా వయలెంట్ రోల్ లో కనిపిస్తోంది. ఎసిపి సత్యభామగా ఆమెని పరిచయం చేస్తూ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో ఒక మగ పోలీస్ అధికారి ఎంత కొట్టినా రౌడీలు నిజం చెప్పడానికి ఒప్పుకోరు. అప్పుడే రెడ్ శారీలో కాజల్ ఎంట్రీ ఇస్తుంది. వాడు వస్తేనే చెప్పలేదు.. నీకు ఎందుకు చెబుతాం అని రౌడీ అంటాడు.  అంతే కాజల్ వాడిపై పిడుగుద్దులతో రెచ్చిపోతుంది. ఆమె చేతి గాజులు కూడా విరిగిపోతాయి. వేంటనే వాడు నిజం చెప్పేందుకు ఒప్ప్పుకుంటాడు. 

కాజల్ చేతికి కూడా రక్తం వస్తూ ఉంటుంది. దీనితో అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ గాజులు లేకుండా కొట్టాల్సింది మేడం అంటుంది. దీనికి కాజల్ ఇచ్చే సమాధానం హైలైట్. లేకుండా ఆల్రెడీ కొట్టాడుగా.. నిజం చెప్పారా అని అంటుంది. టైటిల్ రివీల్ టీజర్ అదిరిపోయింది అనే చెప్పాలి. 

 

టీజర్ లాంచ్ ఈవెంట్ లో కాజల్ మాట్లాడుతూ తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించింది. తాను సినిమాలు మానేస్తున్నాను అంటూ వస్తున్న వార్తలని ఖండించింది. తాను ఎక్కడికి వెళ్లడం లేదు అని ఇక్కడే ఉంది సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చింది. ఇక టైటిల్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కి కాజల్ సంతోషం వ్యక్తం చేసింది. బాబీ తిక్క, శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా