
బాలీవుడ్ ఆల్ మోస్ట్ పడిపోయింది అనుకున్న టైమ్ కు పఠాన్ సినిమాతో.. నిలబెట్టాడు షారుఖ్ ఖాన్. అంతకు ముందు షారుఖ్ కూడా నాలుగేళ్లు విరామం తీసుకున్నాడు. పఠాన్ తో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. షారుఖ్ కెరీర్ లోనే పఠాన్ హైయోస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది.
ఇక అదే వూపుతో.. తమిళ యువ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో.. జవాన్ మూవీ చేస్తున్నాడు షారుఖ్. ఈషినిమాతో బాద్ షా జంటగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దాంతో ఈసినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎంతో ఆశగా ఈసినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశను మిగిల్చింది మూవీ టీమ్. జూన్ 2న రిలీజ్ కావల్సిన జవాన్ మూవీ.. పోస్ట్ పోన్ అయ్యింది. రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ మూవీ అగస్ట్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈసినిమా.. షూటింగ్ పూర్తయ్యింది కాని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఎక్కువ టైమ్ కావల్సి ఉంది. అందుకే మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువ సమయం పడుతోంది. అందుకే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్ర బృందం సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతే కాదు.. షారుఖ్ చేసిన ఫీట్లకు తగ్గ మ్యూజిక్ ఆడ్ చేయడానికి చాలా టైమ్ పడుతుందట. ఇక ఈసినిమాను సౌత్ లో కూడా బాగా మార్కెటింగ్ చేయాలని చూస్తున్నారట టీమ్. అందులో భాగంగా.. రిలీజ్ కు టైమ్ తీసుకుంటున్నారట.