
గీతగోవిందం సినిమాతో ఏమంటా సూపర్ హిట్ కొట్టాడో కాని.. పరశురామ్ కు అన్నీ లక్కీ ఛాన్స్ లే వస్తున్నాయి. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న పరశురామ్.. నెక్ట్స్ మరో స్టార్ హీరోతో సినిమా లాక్ చేసేశాడు.
గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీలో మంచి హిట్ ఇచ్చిన పరశురామ్... చాలా ఓపిక్కగా మహేష్ బాబు కోసం ఎదురు చూశాడు. వేరే ఛాన్స్ వచ్చినా కూడా చేయకుండా.. సూపర్ స్టార్ తో సినిమా చేయాలని పట్టుదలతో ఎదురు చూశాడు. ఆయన శ్రమ ఫలించి చాలా గ్యాప్ తరువాత సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు రానుంది.
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా... తమన్ పాటలతో ఇప్పటికే సగం హిట్ అనిపించుకుంది. ఇక సినిమా రిలీజ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది మహేష్ కనిపించక. ఏడాదికి ఒక్క సినిమా మాత్రే చేసే మహేష్.. ఈసారి రెండేళ్లు గ్యాప్ తీసుకోవడంతో ఇక ఈ సారి సర్కారువారి పాటతో సాలిడ్ హిటో ఇవ్వాలని చూస్తున్నాడు.
ఈ సినిమా తరువాత చేయబోయే మూవీపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ పరశురామ్. అంతకు ముందు నుంచే నాగ చైతన్యతో పరశురామ్ సినిమా ఉండనుందనే టాక్ వచ్చింది. మహేశ్ తో సినిమా ఛాన్స్ రావడం అంత తేలికైన విషయం కాదు గనుక, చైతూతో రెడీ చేసుకున్న ప్రాజెక్టు పక్కన పెట్టేసి పరశురామ్ ఈ వైపు వచ్చాడు. ః
అయితే మహేష్ తో సినిమా తరువాత చైతూ ప్రాజెక్టును పరశురామ్ చేయకపోవచ్చుననే ప్రచారం ఇండస్ట్రీలోగట్టిగానే జరిగింది. కాని ఈ విషయంలో డైరెక్టర్ పరుశురామ్ పక్కాగా క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ .. తన తదుపరి సినిమా నాగచైతన్యతోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అంతా రెడీగానే ఉంది గనుక త్వరలోనే సెట్స్ పైకి వెళతామని అన్నాడు.
కమిట్ మెంట్ ప్రకారం పరశురామ్ మళ్లీ వెనక్కి వచ్చి చైతూతో సినిమా చేయడంపై ఇండస్ట్రీ వర్గాల్లో హర్షం వ్యాక్తం అవుతుంది. పరశురామ్ టేకింగ్ తో నాగచైనతన్యకు సాలిడ్ హిట్ ఇస్తాడంటున్నారు అక్కినేని అభిమానులు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే - రష్మికల పేర్లు వినిపిస్తున్నాయి.