మహేష్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, సర్కారువారి పాట టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతి

Published : May 07, 2022, 07:49 AM IST
మహేష్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, సర్కారువారి పాట టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతి

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్కారువారి పాట సినిమా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.   


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్కారువారి పాట సినిమా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజా చిత్రం స‌ర్కారువారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. అయితే ఈమూవీ టికెట్ రేట్లకు సంబంధించి టీమ్ కు ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. సర్కారువారి పాట సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి నిచ్చింది. 

ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది సర్కారువారి పాట సినిమా. ఈరోజు (మే 7) యూసుఫ్ గూడా పోలీస్ గ్రైండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు టీమ్. ఇక ఈసినిమాకు  సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై 45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఆయా సినిమాల విడుద‌లకు ముందు స‌ద‌రు సినిమా నిర్మాత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌లిసి త‌మ బ‌డ్జెట్‌ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు... స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈమూవీని మైత్రీ మూవీస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళావతి పాట అంతటా..మారు మోగిపోతోంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్. 

ఒక్కో డైలాగ్ గట్టిగా పేలడంతో సూపర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. ఇక  ఫారెన్ టూర్ నుంచి వచ్చిన మహేష్ బాబు వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే