‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత తొలిసారిగా స్పందించిన ఓం రౌత్.. ఏమన్నారంటే?

By Asianet News  |  First Published Jun 17, 2023, 5:09 PM IST

‘ఆదిపురుష్’ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అంచనాలను చేరుకునే ప్రయత్నం చేసినా మిశ్రమ స్పందనే లభించింది. సినిమా విడుదల తర్వాత దర్శకుడు ఓం రౌత్ తొలిసారిగా స్పందించారు. 
 
 


‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut)  తొలిసారిగా స్పందించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త హనుమంతుడి పాత్రలు పోషించారు. అద్బుతమైన నటనతో అలరించారు. భారీ అంచనాలతో నిన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారనే తెలుస్తోంది. ఇందుకు కారణంగా ఆడియెన్స్ నుంచి వచ్చిన మిశ్రమ స్పందననే చెప్పాలి. 

ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత తొలిసారిగా ఓం రౌత్ స్పందించారు. ఓవైపు రామాయణంలోని ప్రధాన పాత్రల చూపించిన తీరు సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓం రౌత్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ట్వీటర్ వేదికన ఆయన స్పందిస్తూ..  ‘జై శ్రీరామ్.. అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయి‘ అంటూ ట్వీట్ చేశారు. అలాగే థియేటర్లలో హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచిన సీట్లకు సంబంధించిన అన్ని ఫొటోలను కలిపి ఓ ఫొటోను విడుదల చేశారు. ఇక ఆదిపురుష్ పై వస్తున్న ఎలాంటి అభిప్రాయాలపైనా ఆయన స్పందించలేదు. 

Latest Videos

మరోవైపు ఓం రౌత్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన రామాయణాన్ని ఆశించిన స్థాయిలో చూపించలేకపోయారని అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో సినిమా ఎగ్జిబిషన్ ను రద్దు చేయాలని హిందూ సేన కూడా పిల్ దాఖలు చేసింది. ఈ క్రమంలో మున్ముందు టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ములేపుతోంది. 

తొలిరోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఒక్కరోజులోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఒక్క తెలుగు స్టేట్స్ లోనే దాదాపు రూ.50కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. అలాగే హిందీలోనూ సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఏకంగా రూ.45 కోట్లు దక్కించుకుంది. మున్ముందు మరింతగా కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం లేకపోలేదు. అయితే, ఇన్ని విమర్శలు, వివాదాల మధ్య ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో చూడాలంటున్నారు. 

 

Jai Shri Ram 🙏🏼 pic.twitter.com/oyXY57U7Lz

— Om Raut (@omraut)
click me!