'ఆదిపురుష్' హిందీ వెర్షన్ పరిస్దితి ఏమిటి..ఫస్ట్ డే రెవిన్యూ ఎంతంటే...

Published : Jun 17, 2023, 04:39 PM IST
'ఆదిపురుష్'  హిందీ వెర్షన్ పరిస్దితి ఏమిటి..ఫస్ట్ డే రెవిన్యూ ఎంతంటే...

సారాంశం

 కోవిడ్ తర్వాత హిందీ సినిమాల్లో   అత్యథిక ఓపినింగ్స్ తెచ్చుకున్న మూడవ చిత్రంగా నిలిచింది.నార్త్ ఇండియాను ఈ సినిమా టార్గెట్ చేయటం,

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న శుక్రవారం రోజు (జూన్ 16న) విడుదలైన సంగతి తెలిసందే.  తొలి రోజు వసూళ్లలో టాక్ కు సంభందం లేకుండా  రికార్డ్ లు క్రియేట్ చేసింది. సాహో చిత్రం రికార్డ్  బ్రేక్ చేసింది.సాహో ఫస్ట్ డే కలెక్ట్ చేసిన రూ. 88 కోట్ల మార్క్ ని అధిగమించి ఇండియా బాక్సాఫీస్ వసూళ్లో టాప్ 4 ఓపెనింగ్ లిస్ట్ లో నిలిచింది.ఆదిపురుష్ సినిమా అన్ని భాషలతో కలిపి ఫస్ట్ డే రూ. 93 కోట్లు రాబట్టింది. ఈ నేఫధ్యంలో హిందీ భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పరిస్దితి ఏమిటి..మొదటి రోజు ఏ స్దాయి ఓపినింగ్స్ తెచ్చుకుందనే విషయం చూస్తే..

బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఆదిపురుష్ హిందీ వెర్షన్ ...తొలిరోజు 36.5 కోట్లతో బంపర్ ఓపినింగ్స్ తెచ్చుకుంది. కోవిడ్ తర్వాత హిందీ సినిమాల్లో   అత్యథిక ఓపినింగ్స్ తెచ్చుకున్న మూడవ చిత్రంగా నిలిచింది.నార్త్ ఇండియాను ఈ సినిమా టార్గెట్ చేయటం, నిర్మాత, దర్శకుడు, హీరోయిన్ తో సహా మాగ్జిమం ఆర్టిస్ట్ లు హిందీ వారు కావటం అక్కడ వారికి నచ్చుతోందని సమాచారం. 
 
 ఈ సినిమా తెలుగు రాష్టాల్లో మొదటి రోజే రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియా మొత్తంలో రూ. 93 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. 
 

ఆంధ్రా - రూ. 16 కోట్లు (రూ. 12.50 కోట్ల షేర్)

సీడెడ్ - రూ. 5 కోట్లు (రూ. 3.75 కోట్ల షేర్)

నైజాం - రూ.18 కోట్లు (రూ. 11 కోట్ల షేర్)


TS/AP మొత్తం - రూ. 45 కోట్లు (రూ. 27.25 కోట్ల షేర్)


కేరళ/తమిళనాడు - రూ. 2 కోట్లు (రూ. 0.75 కోట్ల షేర్)

కర్ణాటక - రూ. 6.50 కోట్లు (రూ. 3.50 కోట్ల షేర్)

ఇండియాలోని మిగతా ఏరియా లో - రూ. 40.50 కోట్లు (రూ. 17.50 కోట్ల షేర్)

మొత్తంగా - రూ. 93 కోట్లు (రూ. 49 కోట్ల షేర్)

మొదటి రోజే ఇంత భారీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు బ్రేక్  ఈవెన్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?