‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ కు సిద్ధం.! మాత వైష్ణో దేవీని దర్శించుకున్న డైరెక్టర్ ఓ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్

By Asianet News  |  First Published Mar 28, 2023, 4:37 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆదిపురుష్’. తాజాగా చిత్ర ప్రమోషన్స్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా మేకర్స్ అప్డేట్ అందించారు. 
 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Krithi Sanon) జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం నాశిరకమైన విజువల్స్, పలు రకాల కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ముఖ్యంగా బెటర్ విజువల్స్ ను అందించేందుకే మరింత సమయం తీసుకున్నారు. 

ఇక ఈ ఏడాది జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు మరో రెండున్నర నెలల సమయమే ఉండటంతో తాజాగా ప్రమోషన్స్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు OM Raut, నిర్మాత Bhushan Kumar  ‘ఆదిపురుష్’ కోసం జమ్మూ కాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. చిత్ర రిలీజ్ ముందు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ట్వీట్ తో అప్డేట్ అందించారు. 

Latest Videos

మంగళకారి.. వైష్ణో దేవి వద్ద దైవానుగ్రహాన్ని కోరుతూ ఆదిపురుష్ ప్రమోషన్స్ ను షురూ చేసినట్టు అప్డేట్ ఇచ్చారు. 2023 జూన్ 16న ‘ఆదిపురుష్’ ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో విడుదల కాబోతుందని తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా దేవీ ఆశీర్వదం తీసుకున్నారు. శ్రీరామనవమి తర్వాత చిత్ర  ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఫ్యాన్స్ కూడా శ్రీరామ నవమికి ప్రచారంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు, ఆడియెన్స్ వేచి ఉన్నారు. గతంలో వచ్చిన ట్రైలర్ మరీ నాసిరకంగా, పేలవంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ కొత్త విజువల్ టీమ్ తో గ్రాండ్ గా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో చిత్రం నుంచి రాబోయే అప్డేట్ ఆసక్తికరంగా మారింది. 

*To a Mangalkaari Shurwaat!*
Seeking divine blessings at Vaishno Devi 🙏 releases IN THEATRES on June 16, 2023 in 3D. pic.twitter.com/V0d3j3boL1

— T-Series (@TSeries)
click me!