కొత్త జంట ఎక్కడికెళ్లినా పక్కనే మంచు అక్క... విష్ణుతో ఈమెకు కూడా చెడిందా?

By Sambi ReddyFirst Published Mar 28, 2023, 3:34 PM IST
Highlights


 మనోజ్-మౌనిక ఎక్కడికెళ్లినా పక్కనే మంచు లక్ష్మి ఉంటున్నారు. విష్ణు-మనోజ్ కి మధ్య విబేధాలు కొనసాగుతున్న వేళ మంచు లక్ష్మి వైఖరి ఆసక్తి రేపుతోంది. 
 

నటుడు మోహన్ బాబు కుమారుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కొన్నాళ్లుగా నాలుగు గోడల మధ్య  జరుగుతున్న గొడవలు రచ్చకెక్కాయి. మనోజ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా వివాదం  తారాస్థాయికి చేరిందని స్పష్టమైంది. ఈ క్రమంలో అక్క మంచు లక్ష్మి ఎవరి పక్షం అనే ఆసక్తికర ప్రశ్న తలెత్తింది. కొన్నాళ్లుగా మంచు లక్ష్మి ప్రవర్తన గమనిస్తున్న టాలీవుడ్ వర్గాలు ఆమె సపోర్ట్ మనోజ్ కే అంటున్నారు. 


అందుకు సాక్ష్యంగా కొన్ని సంఘటనలు ఉదహరిస్తున్నారు. మనోజ్ పెళ్లికి పెద్ద మంచు లక్ష్మినే. మోహన్ బాబు, విష్ణు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. మనోజ్ ఇష్టాన్ని గౌరవించి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నా చిన్న తమ్ముడికి అండగా నిలిచింది. తన నివాసంలో మూడు రోజులు మనోజ్ వివాహం ఘనంగా చేశారు. మోహన్ బాబు పెద్దరికం నిలుపుకోవడం కోసం చివరి నిమిషంలో పెళ్లి మండపానికి వచ్చారు. విష్ణు అయితే వచ్చారో రాలేదో కూడా తెలియదు. 

దీన్ని బట్టి విష్ణు-మనోజ్ లలో తాను చిన్నతమ్ముడు పక్షమే అని తేలిపోయింది. ఆసక్తికర విషయం ఏమిటంటే లక్ష్మితో కూడా విష్ణుకు చెడిందని టాలీవుడ్ టాక్. వీరిద్దరి మధ్య కూడా దూరం పెరిగిందట. మోహన్ బాబు పిల్లలు విష్ణు ఒకవైపు మనోజ్, లక్ష్మి మరొక వైపు చేరారట. మోహన్ బాబు కుటుంబం రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణాలు ఏంటనేది తెలియదు. 

మరొక విశేషం ఏంటంటే... కొత్త జంట మనోజ్-మౌనిక ఎక్కడికెళ్లినా పక్కనే మంచు లక్ష్మి ఉంటున్నారు. మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో ఈ ముగ్గురు కలిసి పాల్గొన్నారు. అలాగే రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి కూడా మనోజ్, లక్ష్మి, మౌనిక హాజరయ్యారు. అదే సమయంలో విష్ణుతో మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో కలిసిన దాఖలాలు లేవు. లక్ష్మి, మనోజ్ ఉన్నారన్న కారణంతో మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ కి విష్ణు దూరంగా ఉన్నారు. మొత్తంగా మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తోందనిపిస్తుంది. 

click me!