మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ కి సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా..? డైరెక్టర్ మోహన్ రాజా ఏమన్నారంటే..?

Published : Oct 16, 2022, 05:38 PM ISTUpdated : Oct 16, 2022, 05:40 PM IST
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ కి సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా..? డైరెక్టర్ మోహన్ రాజా ఏమన్నారంటే..?

సారాంశం

గాడ్ ఫాదర్ అనూహ్య విజయంతో మెగాఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఆచార్య ఫెయిల్యూర్ బాధ నుంచి గాడ్ ఫాదర్ బయట పడేసింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో గాడ్  ఫాదర్ మూవీకి సీక్వెల్ గురించి చర్చ గట్టిగా నడుస్తుంది. ఇంతకీ ఈ సినిమా ఉన్నట్టా లేనట్టా..? ఈ విషయంలో డైరెక్టర్ మోహన్ రాజా ఏమంటున్నాడు. 

చిరంజీవి  హీరోగా..  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది గాడ్ ఫాదర్ మూవీ.  మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈ నెల 5న దరసరా సందర్భంగా  ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఎన్వీ ప్రసాద్ - ఆర్.బి. చౌదరి కలిసి  సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఇప్పటికీ భారీగా వసూళ్లు రాబడుతుంది. ఈ నేపథ్యంలో మోహన్ రాజా టీమ్ తో  చిన్న కార్యక్రమం చేశారు. 

ఈ సందర్భంగా మోహన్ రాజా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.  మోహన్ రాజా మాట్లాడుతూ .. లూసిఫర్  సినిమాను రీమేక్ చేయడం ఒక బాధ్యతగా తీసుకున్నా అని అన్నారు. అంతే కాదు.. రీమేక్ చేస్తున్నాం..అది కూడా ఆ రీమేకును మెగాస్టార్ తో చేస్తున్నాం.. ఇది ఇంకా బరువు..  బాధ్యతతో కూడుకున్న పని. అందువలన ఈ రెండు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూచాలా జాగ్రత్తగా సినిమాను కంప్లీట్ చేశాను అన్నారు మోహాన్ రాజా.  

ఇక చిరంజీవి గారు మాస్ యాక్షన్  సినిమాల గురించి తెలిసిందే.. అలాంటి పాత్రలు చేయడంతో ఆయన నిజంగా మాస్టార్. అంతే కాదు ఆయనతో ఇలాంటి పాత్రలు ఇంకా చేయించాలని ఉంది. అందుకు తగ్గట్టు కొన్ని ఐడియాస్ కూడా తన దగ్గర ఉన్నాయి అన్నారు మోహన్ రాజ.  అలాగే  గాడ్ ఫాదర్ తో మన టీమ్ పై మేకర్స్ కి ఒక నమ్మకం కుదిరింది కనుక, గాడ్ ఫాదర్ 2 కూడా చేసే అవకాశం త్వరలోనే లభిస్తుందని అనుకుంటున్నాను అన్నారు మెహన్ రాజా. ఈ రకంగా చూసుకుంటే.. గాడ్ ఫాదర్ సీక్వేల్ పక్కా అన్నట్టు తెలుస్తోంది. 

ఇక మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు మెహన్ రాజా. ఒక సినిమా మొదలు పెడితే ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ముందుకు వెళ్లడం నేర్చుకున్నాను అని అన్నారు. ఇక కథను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ట్రెండ్ పోయింది ఇప్పుడు. కథను ఎలా చెబుతున్నామనేదే ముఖ్యమైపోయింది. కథను ఇంట్రెస్టింగ్ గా చెబితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు మోహన్ రాజా. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే