‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ మహి వీ రాఘవ్ తాజాగా మరో వెబ్ సిరీస్ తో రాబోతున్నాయి. ఈ సిరీస్ తో తన రూటు మార్చి అలరించబోతున్నారు.
2009 నుంచి డైరెక్టర్ మహి వీ రాఘవ్ (Mahi V Raghav) తెలుగు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈయన తీసినవి తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశారు. విభిన్నమైన కథలతో ఆడియెన్స్ కు కొత్తదనాన్ని అందించడం ఈయన ప్రత్యేకత. ఆయన ఎంచుకునే కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ‘విలేజ్ లో వినాయకుడు’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాలుగైదు సినిమాలతో అలరించారు.
చివరిగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2019లో విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. పొలిటికల్ డ్రామాగా థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ చిత్రం నుంచి దర్శకుడు మహి ప్రతి ప్రాజెక్ట్ తో సక్సెస్ ను అందుకుంటూ వస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
రీసెంట్ గా Save The Tigers వెబ్ సిరీస్ తో నవ్వులు పూయించారు. ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలను కథగా మలిచి సిరీస్ ను రూపొందించారు. ఇది ఏప్రిల్ చివరి వారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ సిరీస్ ల్లో దీనికే మంచి ఆదరణ దక్కింది.
ఈ క్రమంలో దర్శకుడు మహి వీ రాఘవ్ నుంచి ‘సైతాన్’ (Shaitan Web Series) అనే మరో సిరీస్ విడుదలకు సిద్ధమైంది. క్రైమ్ జానర్ లో వస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే ఇన్నాళ్లు కామెడీ, ఎమోషనల్ జానర్ లో అలరించిన మహి వీ రాఘవ్ ఒక్కసారిగా రూటు మార్చారు. తొలిసారిగా క్రైమ్ జానర్ లో వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. దీంతో సిరీస్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
గతంలో ‘ఆనందో బ్రహ్మ‘తో హారర్ర్ కామెడీని తెరకెక్కించి నవ్వులు పూయించారు. ‘సేవ్ ది టైగర్స్’ తర్వాత రాబోతున్న ‘సైతాన్’ వెబ్ సిరీస్ కూడా ఎలా ఉండబోతుందనేది చూడాలి. సిరీస్ మొత్తం ఓ పోలీసు హత్య గురించి నడుతుందని అర్థం అవుతోంది. ఇందులో రిషి, దేవయాని శర్మ, షెల్లీ, జాఫర్ ప్రధాన పాత్రలో నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించింది. జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.