Paruchuri: ఈ స్టుపిడ్ కథని వెంకటేష్ ఎలా ఒప్పుకున్నాడు.. ఎఫ్3పై పరుచూరి విమర్శలు

By team teluguFirst Published Aug 13, 2022, 4:13 PM IST
Highlights

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫన్ ప్రాంచైజీ ఎఫ్3 చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి కామెడీతో అలరించారు. అయితే ఈ చిత్రం కథపై విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫన్ ప్రాంచైజీ ఎఫ్3 చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి కామెడీతో అలరించారు. అయితే ఈ చిత్రం కథపై విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు. లాజిక్ లేని చిత్రంగా చాలా మంది ఎఫ్3పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే హాయిగా నవ్వుకునే చిత్రంలో లాజిక్ లు వెతుక్కోవడం ఏంటని అనిల్ రావిపూడి గతంలో తెలిపారు. 

తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తనదైన శైలిలో విశ్లేషణ అందించారు. ఎఫ్3 చిత్రంపై పరుచూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటేష్ ని మురళి శర్మ కొడుకుగా నటింపజేయడం పెద్ద పొరపాటు అని అన్నారు. వెంకటేష్ వయసు ఎంతో మనకి తెలుసు. 

సాధారణంగా వెంకటేష్ ఇలాంటి స్టుపిడ్ కథలని అంగీకరించరు. కానీ ఈ చిత్రానికి ఎందుకు ఓకె చెప్పారో అర్థం కావడం లేదు. సెకండ్ హాఫ్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ మురళి శర్మ కొడుకులుగా నమ్మించే ప్రయత్నం చేసే సన్నివేశాలు.. తమన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలాగా చూపించడం లాంటివి ఏమాత్రం బాగాలేవని అన్నారు. 

ఎఫ్2 లో భార్య, భర్తల మధ్య రియలిస్టిక్ సమస్యలని ఫన్నీగా చూపించారు. ఆ మూవీలో ఒక సోల్ ఉంది. కానీ ఈ చిత్రంలో అంతా డబ్బు చుట్టూ నడిపించడం పొరపాటు అని పరుచూరి అన్నారు. ఈ చిత్రాన్ని ఆ మాత్రం వసూళ్లు సాధించింది అంటే అందుకు కారణం చివరి 20 నిమిషాలే అని అన్నారు. 

click me!