ఎన్టీఆర్ స్క్రిప్ట్ మొత్తం పక్కన పెట్టేశాడు!

Published : May 26, 2018, 12:57 PM IST
ఎన్టీఆర్ స్క్రిప్ట్ మొత్తం పక్కన పెట్టేశాడు!

సారాంశం

ఏ విషయం కారణంగా దర్శకుడు తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడో ఇప్పుడు 

ఏ విషయం కారణంగా దర్శకుడు తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడో ఇప్పుడు ఆ విషయంలో బాలయ్య పూర్తిగా రాజీ పడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సిద్ధం చేసిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని తేజ చెప్పగా దానికి బాలయ్య అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న అభిప్రాయబేధాల కారణంగా తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటారు.

అయితే ఇప్పుడు దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నాడు. దాదాపుగా క్రిష్ ఎంట్రీ ఖాయమైనట్లే.. అయితే కథ మొత్తం చదివిన క్రిష్ ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నాడట. స్క్రిప్ట్ మొత్తం మళ్లీ రాయాలని.. దానికి కొంత సమయం పడుతుందని బాలయ్యతో చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ఆయన కూడా అంగీకరించినట్లు సమాచారం.

ఎన్టీఆర్ అభిమానులు ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉండేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు రెండు భాగాలుగా చేయాలనుకున్న ఈ కథను ఒక సినిమాగా చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమా మొదలవ్వడానికి కాస్త సమయం పట్టినా.. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే