
భారతీయ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా తో పాటు భరతీయ సినిమా సత్తా చాటిన ఈసినిమా ప్రతీ సారి ఏదో ఒక కొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా నిలుస్తోంది సినిమా.
ఇక రీసెంట్ గా మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడంతో పాటు.. అరుదైన గౌరవాన్ని కూడా అందుకుంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఆర్ ఆర్ ఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ చైనీస్ థియేటర్ లో స్క్రీనింగ్ అయింది. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వెర్షన్ ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్పెషల్ షో వేశారు. ఈ షోకు రాజమౌళి హాజరవగా.. అక్కడ షో అందరిని ఆకట్టుకుందని ట్రిపుల్ ఆర్ అక్కడ కూడా సూపర్ హిట్టయిందనిజజ. తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు జక్కన్న.
థియేటర్లలో హోరెత్తిస్తున్న సినీ జనాల మధ్యలోకి వెళ్లి థ్రిల్ ను ఎంజాయ్ చేసిన వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ.. నా సినిమా, హీరోలపై మీరు చూపించిన ఆదరణ, కురిపించిన ప్రశంసలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి అన్నారు రాజమౌళి. అంతే కాదు యూఎస్ఏకు స్పెషల్ గా కృతజ్ఞతలు కూడా తెలిపారు జక్కన్న. ట్రిపుల్ ఆర్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తరువాత ఫారెన్ ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. వారికి ఎక్కువగా కనెక్ట్ అయ్యింది.
రాంచరణ్ ,ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మల్టీ స్టార్ మూవీలో చరణ్ సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించారు. ఇక ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా 1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆలియా భట్ , ఒలీవియో నటించారు. అజయ్ దేవ్ గణ్, శ్రీయా శరణ్, సముద్రఖని లాంటిస్టార్స్ ప్రత్యేక పాత్రలో నటించారు