ఓటీటీలోకి వస్తున్న అనసూయ ‘దర్జా’.. ఎప్పుడు, ఎక్కడ?

Published : Oct 02, 2022, 05:13 PM IST
ఓటీటీలోకి వస్తున్న అనసూయ ‘దర్జా’.. ఎప్పుడు, ఎక్కడ?

సారాంశం

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ కలిసి నటించిన చిత్రం  ‘దర్జా’. ఓటీటీ రిలీజ్ కు ఈ మూవీ సిద్ధమైంది. తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.   

అందాల యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు  తెచ్చుకుంది  అనసూయ భరద్వాజ్. ‘జబర్దస్త్’ పాపులర్ కామెడీ షోతో టీవీ ఆడియెన్స్ లో అలరించిన ఈ బ్యూటీ వెండితెరపైన అలరిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అనసూయ పోషించిన ‘రంగమ్మత్త’,‘దాక్షాయణి’ పాత్రలు  ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్న అనసూయకు వరుస పెట్టి ఆఫర్లు  కూడా వస్తున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ ‘దర్జా’ (Darja)అనే  చిత్రంలో లీడ్ యాక్ట్రెస్ గా నటించిన విషయం తెలిసిందే.  

అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ ఫిల్మ్ ‘దర్జా’తో ఇటీవల  ప్రేక్షకులను అలరించింది. జూలై 22న థియేటర్లలోనూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యిందీ చిత్రం. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనసూయ మాస్ క్యారెక్టర్ తో అందరిని ఆకర్షించింది. మరోసారి అనసూయ నెగిటివ్ రోల్ ప్లే చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే మూవీలో సునీల్ ప్రధాన పాత్రలో నటించాడు. లేడీ డాన్ గా అనసూయ, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ పెర్ఫామెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి.  అయితే ఈ మూవీ గురించి తాజాగా మరో అప్డేట్ అందింది. 

దసరా స్పెషల్ గా మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు  అనౌన్స్ చేశారు.  ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’(Aha)లో అక్టోబర్ 5న  స్ట్రీమింగ్  షురూ కానున్నట్టు ‘ఆహా’ ప్రకటించింది. దీంతో అనసూయ, సునీల్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదీలా ఉంటే అనసూయ వెండితెరపై వరుస చిత్రాల్లో విభిన్నా పాత్రల ద్వారా అలరిస్తూనే ఉంది. చివరిగా ‘ఖిలాడీ’,‘పక్కా కమర్షియల్’ చిత్రాల ద్వారా అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప  : ది రూల్’,‘రంగ మార్తాండ’ చిత్రాల్లో నటిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌