బిగ్ బాస్2: కౌశల్ పై గీతామాధురి భర్త సెటైర్లు.. మరోసారి కౌశల్, గీతాల మధ్య వేడి చర్చ!

By Udayavani DhuliFirst Published Sep 13, 2018, 11:54 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఈరోజుతో 95 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. గత మూడు రోజులుగా హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను పంపిస్తోన్న సంగతి తెలిసిందే. గీతామాధురి కోసం తన భర్త నందు హౌస్ లోకి వెళ్లగా.. అతడిని చూసి గీతా ఎమోషనల్ అయింది. 
 

బిగ్ బాస్ సీజన్ 2 ఈరోజుతో 95 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. గత మూడు రోజులుగా హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను పంపిస్తోన్న సంగతి తెలిసిందే. గీతామాధురి  కోసం తన భర్త నందు హౌస్ లోకి వెళ్లగా.. అతడిని చూసి గీతా ఎమోషనల్ అయింది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఏడ్చేశారు. ఇంకెప్పుడూ ఇలా దూరంగా ఉండకని గీతాతో  అన్నాడు నందు.

బయట జనాలు ఏం అనుకున్నా.. నాకు నీ మీద చాలా ప్రేమ, నమ్మకం ఉందని ఆమెకు భరోసా ఇచ్చాడు. నందు పరోక్షంగా సామ్రాట్, గీతాల గురించి బయట జరుగుతోన్న చర్చ గురించి మాట్లాడాడు. గీతాతో మాట్లాడుతూనే కౌశల్ కి సెటర్లు వేశాడు నందు. ఏం పని చేయాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలిగా లేదంటే రూల్స్ బ్రేక్ చేశానని నన్ను నామినేట్ చేస్తారా..? అంటూ కౌశల్ పై జోక్స్ చేశాడు.

ఇంట్లో ఏదైనా వస్తువుని ముట్టుకున్నా.. కౌశల్ నేను ఇలా చేయొచ్చా.. అంటూ అతడి పర్మిషన్ తీసుకుంటూ ఫన్ క్రియేట్ చేశాడు నందు. నందు వెళ్లిపోయిన తరువాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ చేపట్టారు. కౌశల్ ని సంచాలకుడిగా నియమించి మిగిలిన ఆరుగురితో గేమ్ ఆడించారు. అయితే ఈ వారం కూడా కెప్టెన్ గా ఎవరూ గెలవలేకపోయారు. ఇక హౌస్ కి సంబంధించిన ప్రాపర్టీని డ్యామేజ్ చేసిందనే కారణంతో దీప్తిని జైలులో పెట్టాడు బిగ్ బాస్.

ఆ సమయంలో దీప్తితో మాట్లాడుతూ 'నేను కూడా జైలులోకి రానా' అంటూ గీతా అడిగింది. దానికి పక్కనే ఉన్న కౌశల్ మీరు ఎలా వెళ్తారు అంటూ చర్చ మొదలుపెట్టాడు. దానికి సమాధానంగా గీతా మీరు రూల్స్ ఎందుకు పెడుతున్నారు అంటూ కౌశల్ పై విరుచుకుపడింది. ఇద్దరి మధ్య చర్చ ముదరడంతో మధ్యలో దీప్తి కల్పించుకొని గొడవకి ఎండ్ కార్డ్ వేసింది. 

click me!