నటుడిగా మారబోతున్న దర్శకేంద్రుడు.. దర్శకత్వం వదిలేసినట్టే?

Published : Nov 29, 2020, 05:08 PM IST
నటుడిగా మారబోతున్న దర్శకేంద్రుడు.. దర్శకత్వం వదిలేసినట్టే?

సారాంశం

దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా తెరపై కనిపించబోతున్నాడట. పాపులర్‌ చిత్రం `పెల్ళి సందడి` రీమేక్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని సమాచారం. 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వందకు పైగా సినిమాలు రూపొందించి దర్శకేంద్రుడిగా పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా కమర్షియల్‌ చిత్రాలకు ఆయన కేరాఫ్‌గా నిలిచారు. హీరోయిన్లని అందంగా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. దర్శకుడిగా సినిమాలు మానేశారు. ఇంకా చెప్పాలంటే నేటి తరానికి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడంలో సఫలం కాలేకపోతున్నారు. చివరగా ఆయన తీసిన `ఓం నమో వెంకటేశాయా` చిత్రం పరాజయం చెందింది. 

ఇదిలా ఉంటే దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా తెరపై కనిపించబోతున్నాడట. పాపులర్‌ చిత్రం `పెల్ళి సందడి` రీమేక్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో కె.రాఘవేంద్రరావు నటుడిగా మారబోతున్నాడని తెలుస్తుంది. ఆయనతోపాటు రమ్యకృష్ణ, సమంత, శ్రియ నటించనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మరి నిజమేంటనేది చూడాలి. మరి రాఘవేంద్రరావు దర్శకత్వాన్ని పూర్తిగా వదిలేసినట్టే అనే కామెంట్‌ వినిపిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా