బాలు ఆరోగ్యంపై ఎమోషనలైన రాఘవేంద్రరావుః హెల్త్ ఎలా ఉందంటే?

Published : Aug 21, 2020, 08:46 PM IST
బాలు ఆరోగ్యంపై ఎమోషనలైన రాఘవేంద్రరావుః హెల్త్ ఎలా ఉందంటే?

సారాంశం

బాలు కోలుకోవాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. `బాలూ.. నాకు మాటలు రావడం లేదు. నువ్వు పాడితే వినాలనుంది. నాతోపాటు నీ  అభిమానులందరూ కన్నీళ్ళతో ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. నీ గంభీరమైన స్వరంతో మైక్‌ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా` అని ట్వీట్‌ చేశారు. 

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గురువారంతో పోల్చితే కాస్త మెరుగ్గా ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం హెల్త్ బులిటెన్‌ని విడుదల చేశారు. `వెంటిలేటర్‌, ఎక్మో సహాయంతో ఐసీయులోనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, తమ వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంద`ని తెలిపారు. 

మరోవైపు బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ స్పందించారు. `ఈ రోజు నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అంటే ఆయన పూర్తిగా కోలుకున్నారని కాదు. వైద్యుల బృందం మాత్రం ఆయన ఆరోగ్యం మెరుగపడే విషయమై ఎంతో నమ్మకంతో ఉంది. మీ అందరి ప్రార్థనల వల్ల నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ పరిణామం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మా కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు` అని తెలిపారు. 

ఇదిలా ఉంటే బాలు కోలుకోవాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. `బాలూ.. నాకు మాటలు రావడం లేదు. నువ్వు పాడితే వినాలనుంది. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్ళతో ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. నీ గంభీరమైన స్వరంతో మైక్‌ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా` అని ట్వీట్‌ చేశారు. 

గత కొన్ని రోజులు గాయకుడు బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విదేశీ వైద్యుల సలహాలతో ఆయనకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?