ఓ వైపు మెగా ర్యాప్‌ సాంగ్‌..మరోవైపు కామన్‌ మోషన్‌ పోస్టర్

Published : Aug 21, 2020, 07:57 PM IST
ఓ వైపు మెగా ర్యాప్‌ సాంగ్‌..మరోవైపు కామన్‌ మోషన్‌ పోస్టర్

సారాంశం

తాజాగా ఎనభైమంది సెలబ్రిటీలు చిరంజీవి బర్త్ డేకి చెందిన కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఓ వైపు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు చిరుకి బర్త్ డే గిఫ్ట్ అందించారు.

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే వేడుక షురూ అయ్యింది. సాయంత్రం ఆరు గంటలకు రామ్‌చరణ్‌ చిరంజీవి బర్త్ డే కామన్‌డీపీని విడుదల చేసి పుట్టిన రోజు వేడుకలను ప్రారంభించారు. ఇక బ్యాక్‌ టూ బ్యాక్‌ బర్త్ డేకి సంబంధించి అప్‌డేట్స్ తో అభిమానులు రెచ్చిపోతున్నారు. మరోవైపు మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి సర్‌ప్రైజ్‌లు వస్తూనే ఉన్నాయి. 

తాజాగా ఎనభైమంది సెలబ్రిటీలు చిరంజీవి బర్త్ డేకి చెందిన కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఓ వైపు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు చిరుకి బర్త్ డే గిఫ్ట్ అందించారు. చిరంజీవి సినిమాలను, ఆయన కెరీర్‌ ఎదిగిన తీరు, ఆయన వ్యక్తిత్వం వంటి అంశాలను మేళవిస్తూ ఓ ర్యాప్‌ సాంగ్‌ని రూపొందించారు. `మెగా ర్యాప్‌ సాంగ్‌` పేరుతో దీన్ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్‌ సైతం ఉర్రూతలూగిస్తుంది. 

ఇక నాగబాబు తమ అన్నయ్యకి బర్త్ డే విశెష్‌ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతోపాటు చిరుకి చెందిన తెలియని నిజాలు, ఇప్పటి వరకు బయటకు రాని ఫోటోలను కూడా పంచుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి సాయంత్రం వరకు చిరు బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం