Harish Shankar: పవన్ మూవీ డిలే, వెధవలు, పనికిమాలినోళ్లు... హరీష్ శంకర్ సంచలన ట్వీట్!

Published : Jun 21, 2022, 12:37 PM ISTUpdated : Jun 21, 2022, 12:39 PM IST
Harish Shankar: పవన్ మూవీ డిలే, వెధవలు, పనికిమాలినోళ్లు...  హరీష్ శంకర్ సంచలన ట్వీట్!

సారాంశం

దర్శకుడు హరీష్ శంకర్ ముక్కుసూటి మనిషి. మనసులో ఏమున్నా ఇట్టే బయటపెట్టేస్తాడు. తాజాగా ఆయన వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సదరు ట్వీట్ లో వెధవలు, పనికిమాలినోళ్లు అంటూ విరుచుకుపడ్డారు. 

హరీష్ శంకర్ (Harish Shankar)అసహనంగా ఉన్నారన్నది నిజం. భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagatsingh)ఆలస్యం కావడమే అందుకు కారణం. పవన్ తో హరీష్ మళ్ళీ మూవీ చేస్తాడని ఎవరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ప్రకటించడంతో ఇది సాధ్యమైంది. హరీష్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇకపై పవన్ తో మూవీ చేయలేనేమో అనుకుంటున్న తరుణంలో హరీష్ కి అవకాశం వచ్చింది. 10 ఏళ్ల తర్వాత సెట్ అయిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో కావడంతో ఫ్యాన్స్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. తీరా చూస్తే భవదీయుడు భగత్ సింగ్ కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు. పవన్ పొలిటికల్ అజెండాల కారణంగా ఈ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. 

ఇక 2024 తర్వాతే భవదీయుడు భగత్ సింగ్ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ లోగా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu), వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వారం ఎదురు చూసి హరీష్ వేరే హీరోని వెతుక్కోనున్నారంటూ కొందరు ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై హరీష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 

సీఎం కేసీఆర్ ''వెధవలు, పనికిమాలినోళ్లు ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు''  అంటూ తిట్టిన వీడియో బైట్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉంది సీఎం కేసీఆర్ అయినప్పటికీ ఫీలింగ్ మాత్రం హరీష్ శంకర్ దే. భవదీయుడు భగత్ సింగ్ మూవీపై వస్తున్న పుకార్లను, తనను ఉద్దేశించి చేస్తున్న కామెంట్లుకు హరీష్ ఆ విధంగా సమాధానం చెప్పారు. హరీష్ శంకర్ లేటెస్ట్ ట్వీట్ వైరల్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మించనున్నారు . పవన్ కళ్యాణ్ కి జంటగా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. ఈ మూవీలో పవన్ ప్రొఫెసర్ గా కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ మూవీతో భారీ హిట్ కొట్టిన పవన్-హరీష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: అసలు ప్రభాస్ ఎవరు ? నాకు చిరంజీవి, చీను భర్త మాత్రమే తెలుసు.. స్టార్ హీరోకి ఫ్యూజులు ఎగిరిపోయాయి
IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?