చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌

Published : Jun 21, 2022, 11:59 AM IST
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌

సారాంశం

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో నటి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల వరుసగా టీవీ నటిమణులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నటి బలయ్యింది. ఒడియాకి చెందిన బుల్లితెర నటి రష్మీ రేఖ(23) ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం(జూన్‌ 18)న ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్‌లోని గదసాహి ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దే ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది రష్మి రేఖ. 

గత కొంత కాలంగా రష్మీ రేఖ ఆ ఇంట్లోనే అద్దెకు ఉంటుంది. ఇంటి యాజమాని అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యం కావడం కలకలం సృష్టిస్తుంది. అందులో తన మరణానికి కారణం ఎవరనేది తెలిపింది రష్మి రేఖ. చివరగా `ఐ లవ్‌ యూ సాన్‌` అని రాసుకొచ్చింది. 

23 ఏళ్ల రష్మీ రేఖ కొన్నాళ్లుగా సంతోష్‌ అనే వ్యక్తితో  సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్‌ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. `శనివారం (జూన్‌ 18) రష్మీకి కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత తను చనిపోయినట్లు సంతోష్‌ మాకు చెప్పాడు. సంతోష్‌, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు మాకు తెలియదు` అని రష్మీ రేఖ తండ్రి తెలిపారు. అతను మోసం చేయడం వల్లే తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన రష్మీ 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్‌తో గుర్తింపు పొందింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?