దర్శకుడు క్రిష్ కు హరీశ్ శంకర్ బర్త్ డే విషెస్... పుట్టిన రోజునే తెలివిగా ఆ విషయాన్ని గుర్తు చేశాడే!

Published : Nov 10, 2022, 04:51 PM ISTUpdated : Nov 10, 2022, 04:52 PM IST
దర్శకుడు క్రిష్ కు హరీశ్ శంకర్ బర్త్ డే విషెస్... పుట్టిన రోజునే తెలివిగా ఆ విషయాన్ని గుర్తు చేశాడే!

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్లు క్రిష్, హరీశ్ శంకర్ మధ్య కన్వర్జేషన్ ఆసక్తికరంగా మారుతోంది. ఈరోజు క్రిష్ పుట్టిన రోజు సందర్భంగా హరీశ్ శంకర్ బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే ‘హరిహర వీరమల్లు’పై ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేశారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘భవధీయుడు భగత్ సింగ్’ చిత్రాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్లు  క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్  ఆ సినిమాలకు దర్శకత్వం వహస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కేరీర్ కు సమయం కేటాయిస్తుండటంతో ఈ చిత్రాలు ముందుకు సాగడం లేదు. అయినా అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ ఈ చిత్రాలను పూర్తి చేసేలా షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రంలో నటిస్తున్నారు. 

‘హరిహర వీరమల్లు’ పూర్తైతేనే పవన్ కళ్యాణ్ హరిశ్ శంకర్ దర్శకత్వంలోని ‘భవధీయుడు భగత్ సింగ్’ (Bhavadheeydu Bhagat Singh) ముందుకు సాగుతుంది.  ఇదే విషయాన్ని తాజాగా డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ క్రిష్ కు ఇండైరెక్ట్ గా తెలిపారని పలువురు భావిస్తున్నారు. అదీ క్రిష్ పుట్టినరోజునే చెప్పడం పట్ల వైరల్ గా మారుతోంది. ఈరోజు  క్రిష్ బర్త్ డే సందర్భంగా సెలబ్రెటీలు, సినీ ప్రముఖులు తమ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. 

తాజాగా హరీశ్ శంకర్ (Harish Shankar) కూడా క్రిష్ కు విషెస్ తెలిపారు.  ‘ప్రముఖ రచయిత, దర్శకుడు, ప్రియమైన స్నేహితుడు క్రిష్ కు జన్మదిన శుభాకాంక్షలు. ‘హరిహర వీరమల్లు’ను త్వరగా తీసుకురండి బ్రో’ అంటూ ట్వీట్ చేశారు. విషెస్ తెలపడంతో పాటు.. పవన్ కళ్యాణ్, క్రిష్, హరీశ్ కలిసి ఉన్న భీమ్లా నాయక్ సెట్ లోని ఫొటోలను షేర్ చేశాడు.  అప్పటి నుంచే హరీశ్ శంకర్ పవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ క్రమంలో హరీశ్ శంకర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. క్రిష్ చేతి నుంచి హరీశ్ శంకర్ డైరెక్షన్ లోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. హరిశ్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన  ‘గబ్బర్ సింగ్’ తర్వాత  మళ్లీ పదేండ్లకు ఈ క్రేజీగా కాంబినేషన్ కుదిరింది. దీంతో ‘భవధీయుడు భగత్ సింగ్’ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 లో ముద్దుల గోల , డార్క్ రూమ్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్