జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, యంగ్ హీరోకి భారీ రెమ్యునరేషన్..?

Published : Nov 10, 2022, 04:23 PM IST
జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్,  యంగ్ హీరోకి భారీ రెమ్యునరేషన్..?

సారాంశం

తెలుగు తెరపై వెలుగుతున్న మలయాళ వెలుగు దుల్కర్ సల్మాన్. ఈ యంగ్ హీరో త్వరలో వెండితెరపై వైఎస్ జగన్ గా కనిపించబోతున్నారట. అందుకోసం భారీగా రెమ్యూనరేషన్ కూడా అందుకోబోతున్నాడట.     

 
సీతారామం సినిమాతో టాలీవుడ లో పాతుకుపోయాడు  దుల్కర్ సల్మాన్. ఈ మూవీతో ఇక పక్కా తెలుగు హీరో అనిపించుకున్నాడు దుల్కర్. రీసెంట్ గా వచ్చి.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయమందుకుంది సినిమా. ఈక్రమంలోనే దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఆఫర్లు పెరిగిపోతున్నాయి. సినిమా ఛాన్స్ లు గుమ్మం ముందుకు వచ్చి నిలుచుంటున్నాయి. ఇక  ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. 

ఇక ఇక్కడ విశేషం ఏంటీ అంటే.. ఈ మూవీ ఏపీ సీఎం జగన్ కు సంబంధించిందిగా తెలుస్తోంది. యాత్ర-2 పేరుతో జగన్ కు సబంధించిన విశేషాలతో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ లో జగన్ పాత్ర కోసం దుల్కర్ ను అడిగారట మేకర్స్. మొదట ఆలోచించినా.. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో ఈ ప్రాజెక్టుకు దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పారని తెలుస్తోంది.

2024 ఎన్నికల నేపథ్యంలోఈ సినిమా ఉండబోతున్నట్ట తెలుస్తోంది. జగన్ రాజకీయ జీవితానికి  ఊతం ఇచ్చేలా.. ఈసినిమా ఉపయోగపడనున్నట్టు తెలుస్తోంది. గతంలో యాత్ర సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ డైరెక్షన్లో ఈ సినిమా రానుండగా ముఖ్యమంత్రి జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వైయస్సార్ చనిపోయిన తర్వాత ఎదురైనా పరిస్థితులు, జగన్ ఎదుర్కొన్న తీరు ప్రధానంగా ఈ మూవీలో చూపించబోతున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈమూవీ రూపొందుతున్నట్టు సమాచారం అయితే నిర్మాతలెవరు అన్నది మాత్రం తెలియడంలేదు. 

ఇక గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పాదయత్రాను బేస్ చేసుకుని యాత్ర పేరుతో సినిమానురూపొందించారు డైరెక్టర్ మహి. ఇక ఈసారి యాత్ర 2లో సీఎం జగన్ కు ఎదురైన పరిస్థితుల గురించి  ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే యాత్ర సినిమాలో మమ్ముట్టి నటించడంతో... యాత్ర2 కోసం ఆయన తనయుడు దుల్కర్ ను తీసుకున్నట్ట తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈన్యూస్ ప్రకటించలేదు. అంతేకాదు  ఈసినిమాలో మమ్ముట్టి కూడా నటిస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే