సాయి ధరమ్ సూపర్ ఫిట్... ఆసక్తిరేపుతున్న దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్

Published : Oct 21, 2021, 08:22 AM IST
సాయి ధరమ్ సూపర్ ఫిట్... ఆసక్తిరేపుతున్న దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్

సారాంశం

సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన Sai dharam నెలరోజుల ట్రీట్మెంట్ తరువాత ఈనెల 15న డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రమాదంలో సాయి ధరమ్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది.   

హీరో సాయి ధరమ్ హెల్త్ కండీషన్ పై దర్శకుడు హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చారు. ఆయనను కలిసినట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన Sai dharam నెలరోజుల ట్రీట్మెంట్ తరువాత ఈనెల 15న డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రమాదంలో సాయి ధరమ్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. 


సాయి ధరమ్ తేజ్ ని కలిసిన Harisha shankar ఈ విధంగా స్పందించారు. ‘నా సోదరుడు సాయిధరమ్‌ తేజ్‌ను కలిశాను. చాలా సేపు అతనితో మాట్లాడటం జరిగింది. అతను సూపర్ ఫిట్‌గా ఉన్నాడని మరియు మళ్లీ తన నటనతో మెరిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలపడానికి చాలా సంతోషిస్తున్నాను. ‘ఫుల్లీ అండ్ మళ్ళీ లోడెడ్’’ అని హరీష్ శంకర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Aslo read ఎట్టకేలకు ఈడీ ముందుకు జాక్వెలిన్.. రూ.200 కోట్ల చీటింగ్ లో అతడి నుంచి లగ్జరీ కారు, షాకింగ్

దర్శకుడు హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ పవన్ కళ్యాణ్ తో మూవీ ప్రకటించారు. Pawan kalyan భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఈ చిత్రానికి నిర్ణయించడం జరిగింది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్.. సాయి ధరమ్ ని కలవడం జరిగింది. 

Aslo read జబర్దస్త్ అవినాష్ పెళ్లి... హాజరైన బిగ్ బాస్ సెలబ్రిటీలు!
ఇక సాయి ధరమ్ దాదాపు కోలుకున్నట్లు తెలుస్తుండగా... త్వరలోనే షూటింగ్ సెట్స్ లో జాయిన్ కానున్నారట. ఆయన గత చిత్రం రిపబ్లిక్ ఇటీవల విడుదల కావడం జరిగింది. దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌