Live Video: ఫలక్ నుమా ప్యాలస్ లో ఘనంగా డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం

Published : Dec 02, 2022, 08:20 PM ISTUpdated : Dec 02, 2022, 08:27 PM IST
Live Video: ఫలక్ నుమా ప్యాలస్ లో ఘనంగా డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం

సారాంశం

సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ పెళ్లిపీటలెక్కారు. రవి ప్రఖ్య ఆమె చేయి అందుకొని ఏడడుగులు వేశారు.హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలస్ లో నీలిమ గుణ-రవి వివాహం ఘనంగా జరుగుతుంది. 

గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ సినిమాను కెరీర్ గా ఎంచుకున్నారు. ఆమె తండ్రి గుణశేఖర్ తెరకెక్కించే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2015 లో విడుదలైన రుద్రమదేవి చిత్రానికి నీలిమ సహనిర్మాతగా ఉన్నారు. అనుష్క హీరోయిన్ గా నటించిన రుద్రమదేవి చిత్రాన్ని గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రుద్రమదేవి క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంది. 

ప్రస్తుతం గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో ఆమె శాకుంతలం నిర్మిస్తున్నారు. సమంత హీరోయిన్ గా పౌరాణికగాథగా తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. విడుదల తేదీ ప్రకటించి వాయిదా వేశారు. శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. 

28 ఏళ్ల నీలిమ గుణ నేడు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. రవి ప్రఖ్యను ఆమె వివాహం చేసుకుంటున్నారు. నేడు హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలస్ లో నీలిమ గుణ వివాహం ఘనంగా జరుగుతుంది. చిత్ర ప్రముఖులు ఒక్కొక్కరిగా హాజరవుతున్నారు. నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా