పునీత్ రాజ్ కుమార్ కు మరో అరుదైన గౌరవం, పాఠ్యాంశంగా కన్నడ పవర్ స్టార్ జీవిత చరిత్ర

By Mahesh JujjuriFirst Published Dec 2, 2022, 5:50 PM IST
Highlights

కోట్లాది అభిమానులకు అన్యాయంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్. ఆయన ఈప్రపంచాన్ని వదిలి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా కర్నాట రత్న బిరుదుతో పాటు.. మరో అరుదైన గౌరవాన్ని అందించింది కన్నడ ప్రభుత్వం. 

కోట్లాది అభిమానులకు అన్యాయంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్. ఆయన ఈప్రపంచాన్ని వదిలి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా కర్నాట రత్న బిరుదుతో పాటు.. మరో అరుదైన గౌరవాన్ని అందించింది కన్నడ ప్రభుత్వం. 

కన్నడ కోటి అభిమాన గణాన్ని ధుఖంలో ముంచి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు కన్నడ పవర్ స్టార్.. పునిత్ రాజ్ కుమార్. ఆయన అకాల మరణం శండల్ వుడ్ ను దుఖ సాగరంలో ముంచేసింది. సినీ వర్గాల తో పాటు.. రాజకీయ వర్గాలలో కూడా ఆయన మరణం జీర్ణించుకోలేక పోయారు. అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలు చేశారు. ఇక పునిత్ మరణించి ఏడాది దాటిపోయింది. రీసెంట్ గా ఆయనకు కన్నడ ప్రభుత్వం ఆరాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్నాటక రత్నను ఇచ్చింది. 

అంతటితో ఆగలేదు అక్కడ గవర్నమెంట్. పునిత్ మంచితనానికి.. ఆయన పేరు బయటకు రాకుండా చేస్తున్న సేవలకు మరో గుర్తింపు ఉండాలి.. అది కూడా శాస్వతంగా ఉండాలి అనుకున్నారు. అందుకే ఆయన జీవితాన్ని పాఠంగా మార్చాలని నిర్ణయించారు. కర్ణాటకలోని స్కూల్‌ సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తాము ఆ దిశగా ఆలోచన చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చెప్పారు.

ఇటు సినిమాలు చేస్తూ... కన్నడ పవర్ స్టార్ గా గుర్తింపు పొందడమే కాకుండా రియల్ హీరో అని కూడా అనిపించుకున్నాడు పునీత్‌ రాజ్‌కుమార్‌. దాదాపు 8 వందలాది మంది నిరుపేద విద్యార్థులను, అనాధలను తన సొంత ఖర్చుతో చదివించి గొప్ప మానవతా మూర్తిగా నిలిచారు. అందుకే  ఆయన జీవితచరిత్ర నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్ణాటకకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. 

అంతే కాదు పునీత్‌ రాజ్‌కుమార్‌ నేత్రదానాన్ని, మనస్పూర్తిగా ఒక వ్యాక్తి చేసే రక్తదానాన్ని పోత్సహించారని, ఎన్నో వృద్ధాశ్రమాలకు అండగా నిలిచారని వారు చెబుతున్నారు.ఇంతకంటే ఎక్కువే చేస్తూన్నా.. ఆయన మాత్రం తన పేరును ఎప్పుడూ బయట చెప్పలేదు. ఎక్కడా వాడుకోలేదు అని అంటున్నారు. అందుకే ఎందరికో ఆదర్శపాయంగా నిలిచిన పునిత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను ప్రతీ పిల్లవాడు తెలుసుకోవాలి అనే ఉద్ధేశ్యంలోనే ఇలా చేసినట్టు సమాచారం. 
 

click me!