
ఆఇద్దరు స్టార్లే..ఒకరు డైరెక్టర్లలో స్టార్ అయితే,మరొకరు హీరోలలోస్టార్లు. కోలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారీ వ్యక్తులు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ . డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ..ప్రయోగాలకు పెద్ద పీటవేస్తూ.. ఎప్పటికపుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తుంటాడు స్టార్ హీరో విక్రమ్. ఈ ఇద్దరూ స్టార్లు కలిశారంటే ఏదో ఒక విశేషం తప్పకుండా ఉంటుంది. ఇప్పులు అలాండిసందర్భమే వచ్చింది.
గౌతమ్ మీనన్ విక్రమ్ ను కలిసిన స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరు ఎందుకు కలిశారు అన్న విషయంలో పక్కాగా క్లారిటీ లేదు కాని.. గౌతమ్ మీనన్ పోస్ట్ ను బట్టి మాత్రం ఓ సినిమా విషయమై వీరు కలిసినట్టుఅర్ధం అవుతుంది. గౌతమ్ మీనన్ నెక్ట్స్ చిత్రం వెంధు థనింధతు కాదు సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా విశేషాలు వాళ్లు ఈ సందర్భంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
అయితే హీరో విక్రమ్‌ను కలిసినపుడు తీసిన ఫోటోను గౌతమ్ మీనన్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అంతే కాదు ఈ ఫోటోకు అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. . నక్షత్రాలు కలిసిపోతాయి.. అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు గౌతమ్ మీనన్. అయితే ఈ క్యాప్షన్ లోకూడా ఓ చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. విక్రమ్ అప్ కమింగ్ మూవీ ధ్రువ నక్షత్రం ఈ సినిమాను ఉద్ధేశించే గౌతమ్ ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.తాజా స్టిల్‌తో ఈ యాక్టర్ అండ్ డైరెక్టర్ త్వరలోనే మరో రిలీజ్ అప్‌డేట్ కూడా ఇవ్వబోతున్నారంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు అభిమానులు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. విక్రమ్ ప్రస్తుతం మణిరత్నండౌరెక్షన్ లో పొన్నియన్ సెల్వన్ మూవీలో కూడా నటిస్తున్నారు. ఈమూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ ఫార్ట్ మూవీ సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతోంది.