మా ఎమోషన్స్ తో ఆడుకోవద్దు.. ప్రభాస్ ను రప్పించండి.. ‘సీతారామం’ మేకర్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..

Published : Aug 02, 2022, 06:16 PM IST
మా ఎమోషన్స్ తో ఆడుకోవద్దు.. ప్రభాస్ ను రప్పించండి.. ‘సీతారామం’ మేకర్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..

సారాంశం

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక ఇప్పుడైనా తీరుతుందా? క్రేజీ ప్రాజెక్టులతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు సిద్ధమవుతున్న డార్లింగ్ ను ఫ్యాన్స్ ఒక్కసారైనా చూడాలనుకుంటున్నారు. దీంతో ‘సీతారామం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  ప్రభాస్ ను  ఆహ్వానించాలని కోరుతున్నారు. 

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) - యంగ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘సీతా రామం’ మూడు రోజుల్లో ప్రేక్షకకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ కు ఆడియెన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మూడు రోజుల్లో సినిమా రిలీజ్ ఉన్నా.. నేటికీ ఈవెంట్ కు సంబంధించిన ప్లేస్, టైం, డేట్, చీఫ్ గెస్ట్ ఎవరనే దానిపై పక్కాగా అనౌన్స్ మెంట్ చేయలేదు. కానీ ఏ బిగ్ సర్ ప్రైజ్ అంటూ మేకర్స్ ఆడియెన్స్ లో ఆసక్తిని నెలకొల్పారు.

దీంతో ఆ సర్ ప్రైజ్ చీఫ్ గెస్ట్ పైనా అయ్యింటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ తాజాగా రంగంలోకి దిగారు. Sita Ramam ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను ఆహ్వానించచాలని కోరుతున్నారు. ఇలాంటి సర్ ప్రైజ్ లని చెబుతూ తీరా అప్సెట్ చేయకూడదని.. మా ఎమోషన్స్ తో ఆడుకోవద్దని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. తప్పకుండా ప్రభాస్ నే ఆహ్వానించాలని కోరుతున్నారు. ఏమైనా వస్తే సహించబోమని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రేపు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈవెంట్ ను మాత్రం కచ్చితంగా హైదరాబాద్ లోనే నిర్వహించనున్నట్టు గట్టి ప్రచారం జరుగుతోంది. సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్నారు. 

యంగ్ స్టార్స్ దుల్కర్ సల్మాన్,  మృణాల్ ఠాగూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా..  స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో నటిస్తున్నారు. హనురాఘవపూడి దర్శకత్వం సరికొత్తగా అనిపించనుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మాత అశ్విని దత్  మూవీని నిర్మించారు. ఆగస్టు 5న థియేటర్లలో గ్రాండ్ గా నిర్వహించనుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?