
ప్రముఖ తెలుగు సినీ దర్శకులు దాసరి నారాయణ రావు కన్నుమూసారు. గత కొంత కాలంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ తో సతమతమవుతున్న దాసరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో ఈనెల 17న దాసరి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గత 5 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు,నటుడు దాసరి నారాయణ రావు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అనారోగ్య సమస్యలతో జనవరిలో తొలిసారి ఆసుపత్రిలో చేరిన దాసరి శస్త్ర చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయారు. ఈ నెల 4వ తేదీన తన 75వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతలోనే వారం క్రితం మరోసారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. మూడ్రోజుల క్రితం మరోసారి సర్జరీ చేశారని తెలుస్తోంది. అయితే దాసరి శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో ఈ సాయంత్రం కన్నుమూశారు.
వారం క్రితమే రెండోసారి కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. బీపీలో హెచ్చుతగ్గులు, అన్నావాహికకు రంద్రాలు, దాని వల్ల ఇన్‌ఫెక్షన్ సోకడం తదితరాల వల్ల ఆరోగ్యం క్షీణించింది. ఈ ఏడాది జనవరి 19న మొదటిసారి ఆసుపత్రిలో చేరారు. మార్చి 29న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఒకింత ఉత్సాహంగానే కనిపించారు. మళ్లీ ఈ నెల 17న రెండోసారి ఆసుపత్రిలో చేరారు. గడిచిన అయిదు నెలల్లో దాసరి నారాయణ రావుకు రెండుసార్లు చికిత్స జరిగింది. తొలిసారి జనవరి 19న ఆసుపత్రిలో చేరారు. అప్పుడు చికిత్స అనంతరం మార్చి 29వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయనకు అప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు.
తర్వాత మూడు రోజుల క్రితం దాసరికి మరోసారి సర్జరీ జరిగింది. ఇన్‌ఫెక్షన్ సోకి ఇవాళ సాయంత్రం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు.