పవన్‌ని అవమానించిన ఇంటి ఓనర్‌.. చిరు మాస్ వార్నింగ్‌.. సీక్రెట్‌ బయటపెట్టిన దర్శకుడు బాబీ

Published : Aug 06, 2023, 10:30 PM IST
పవన్‌ని అవమానించిన ఇంటి ఓనర్‌.. చిరు మాస్ వార్నింగ్‌.. సీక్రెట్‌ బయటపెట్టిన దర్శకుడు బాబీ

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఈరోజు హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. వేదికపై దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఓ సీక్రెట్ ను రివీల్ చేశారు.   

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  - మిల్క్ బ్యూటీ  తమన్నా భాటియా జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar).   మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, సుశాంత్ అక్కినేని కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పా కళా వేదికలో ఈరోజు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.  ఈవెంట్ కు నటి మెహర్ రమేశ్, కీర్తి సురేష్, యంగ్ డైరెక్టర్స్ బాబీ, సంపత్ నంది, గోపీచంద్ మాలినేని, బుచ్చిబాబు, వంశీ పైడిపల్లి, హైపర్ ఆది, శ్రీముఖి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై బాబీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ను బయట పెట్టారు. 

బాబీ మాట్లాడుతూ.. హైపర్ ఆది చిరంజీవి గారికి ఆవేశం రాదేని అన్నారు. నిజానికి ఆయన్ని ఎవరేమన్నా కోపగించుకోరు. కానీ ఆయన తమ్ముళ్ల జోలికొస్తే మాత్రం ఊరుకోరు. ఈ సందర్భంగా ఎవ్వరికీ తెలియని, నేను విన్న ఓ ఉదాహరణను చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  కు సంబంధించిన సినిమా షూటింగ్ ఓ ఇంటిలో  జరుగుతోంది. అక్కడ సినిమా యూనిట్ లోని ఒకరు చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చారు.  అది చూసిన ఇంటి ఓనర్ అతన్ని బూతులు తిట్టి వెళ్లిపోమన్నారు. 

అది చూసిన పవన్ కళ్యాణ్ యూనిట్ చెప్పులు వేసుకోకుండా ఎలా వర్క్ చేస్తారు. మీకు డబ్బులు చెల్లించాంగా.. ఇంకా సమస్యేంటని ప్రశ్నించారు. అయినా ఓనర్ అవమానించడంతో నేనూ కూడా షూటింగ్ చేయనని పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఆ విషయం ఎక్కడో షూటింగ్ లో ఉన్న చిరంజీవికి తెలిసింది. వెంటనే ఆ ఓనర్ కు ఫోన్ చేసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నా తమ్ముడిని ఎలా పో అంటావు.. నీ ఇంటి ఖరీదెంతా’ అంటూ గట్టిగా ప్రశ్నించారు అని చెప్పుకొచ్చారు. 

ఆయన జోలికి వస్తే ఊరుకుంటారేమో గానీ.. ఆయన తమ్ముళ్ల జోలికి వస్తే మాత్రం సహించరని బాబీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాబీ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇక పవన్ కు ఇప్పటికీ చిరు కావాల్సినంత సపోర్ట్ అందిస్తూనే ఉన్నారు. ఆయా సందర్భాల్లో తమ్ముడు పవన్ పై ప్రేమ వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాబీ - చిరంజీవి కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి విధితమే. ఆ సినిమా తర్వాత తనకూ మరింత గౌరవం, మర్యాద పెరిగాయని వేదికపై చెప్పుకొచ్చారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా