భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది కొన్ని వివాదాస్పదమైన అంశాలని కూడా టచ్ చేశాడు. తనదైన శైలిలో పంచ్ లు పేల్చాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. నేడు ఆదివారం రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది కొన్ని వివాదాస్పదమైన అంశాలని కూడా టచ్ చేశాడు. తనదైన శైలిలో పంచ్ లు పేల్చాడు. కొందరు తెలివైన శాడిస్టులు ఉంటారు.. అన్నయ్యని పొగుడుతూ తమ్ముడిని తిడతారు. షూటింగ్ సమయంలో చిరంజీవి గారు నాతో ఒక మాట అన్నారు. ఈ మధ్యన తాను పాలిటిక్స్ ఫాలో కావడం లేదు అని చెప్పారు. ఎందుకు అని అడిగితే నా తమ్ముడిని తిడుతుంటే నేను చూడలేను అని అన్నారు.
అన్నయ్య మంచోడు కాబట్టే ముంచేశారు.. కానీ తమ్ముడు మొండోడు.. అన్నయ్యని తిట్టిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తారు. ఇక భోళా శంకర్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్ పండింది. ఈ చిత్రంలో సిస్టర్ సెంటిమెంట్ బాగా అలరిస్తుంది. భోళా శంకర్ సినిమా కోసం నిర్మాతలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యన ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు వెనకేసుకున్న కలెక్షన్స్ తో పోల్చుకుంటే మన కలెక్షన్స్ తక్కువే అంటూ.. బ్రో చిత్రంలో వివాదంపై హైపర్ ఆది పరోక్షంగా సెటైర్లు వేశారు.