సచిన్ కొడుకు సచిన్ కాలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు, వరుస పంచ్ లతో హోరెత్తించిన హైపర్ ఆది

Published : Aug 06, 2023, 09:31 PM ISTUpdated : Aug 06, 2023, 09:49 PM IST
సచిన్ కొడుకు సచిన్ కాలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు, వరుస పంచ్ లతో హోరెత్తించిన హైపర్ ఆది

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది.  నేడు ఆదివారం రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ఈ చిత్రంలో నటించిన బుల్లితెర కమిడియన్ హైపర్ ఆది తన పంచ్ లు, ప్రాసలతో ప్రవాహంలా ప్రసంగాన్ని కొనసాగించాడు. చిరంజీవి ఆయన కుటుంబ సభ్యుల గొప్పతనం వివరిస్తూనే.. అప్పుడప్పుడూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన వారికీ పరోక్షంగా చురకలంటించారు. 

హైపర్ ఆది ప్రసంగం గమనిస్తే.. ఒక సామాన్యుడు వీరాధివీరులు ఉండే యుద్ధ భూమికి వెళ్ళాడు. వాళ్ళందరిని మురిపిస్తూ యుద్ధం చేసే గెలవడం ప్రారంభించారు. దీనితో ఆ వీరులంతా సామాన్యుడిని సైన్యాధిపతిని చేశారు. 30 ఏళ్లుగా ఆ సైన్యాధిపతి తాను విజయాలు సాధిస్తూ ఎందరో సైనికుల్ని తయారు చేశారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. 

అన్నయ్య ఇంద్రసేనాని అయితే తమ్ముడు జనసేనానిగా జనసైనికులని తయారు చేస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్  గురించి హైపర్ ఆది ప్రస్తావించారు. ఫ్యాను లేను ఇల్లు ఉంటుందేమో కానీ మెగా ఫ్యాన్ లేని ఇల్లు ఉండదు. నా దృష్టిలో సచిన్ టెండూల్కర్, చిరంజీవి ఒక్కటే. సచిన్ విమర్శలు ఎదురైతే బ్యాటుతో సమాధానం చెప్పేవారు. మెగాస్టార్ విమర్శలు ఎదురైతే సక్సెస్ తో సమాధానం చెబుతారు. ఆచార్యతో విమర్శలు వచ్చాయి.. వాల్తేరు వీరయ్యతో సమాధానం చెప్పారు. డ్యాన్సులతో, ఫైట్స్ తో చిరంజీవి గారు ఒక మార్క్ సెట్ చేశారు. ఎన్నో అవమానాలు ఎదురైనా చిరంజీవి సంస్కారంతో భరించారు. 

ఠాగూర్ చిత్రంలో ఆయనకి నచ్చని మాట క్షమించడం.. రియల్ లైఫ్ లో అదే ఆయనకి ఇష్టమైన మాట అంటూ హైపర్ ఆది పేల్చినా పంచ్ కి చిరు సైతం నవ్వుతూ చప్పట్లు కొట్టారు. కొందరు హీరో సుమన్, ఉదయకిరణ్ లాంటి సున్నితమైన అంశాలని వాడుకుంటూ యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్లు వేసుకుంటూ ఉంటారు. వారిని కూడా చిరంజీవి క్షమించేశారు అని హైపర్ ఆది అన్నారు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేదు. సచిన్ కొడుకు సచిన్ కాలేదు. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యారు. రంగస్థలం అనే చిత్రంతో అందరికి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు అంటూ రాంచరణ్ గురించి ప్రశంసలు కురిపించారు. 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా